Saturday, January 28, 2023
More
  Homelatestసినిమాలకు గుడ్‌బై.. రానా దగ్గుబాటి సంచలన నిర్ణయం?

  సినిమాలకు గుడ్‌బై.. రానా దగ్గుబాటి సంచలన నిర్ణయం?

  Rana Daggubati

  టాలీవుడ్‌లోని బడా బడా నిర్మాణ సంస్థల్లో సురేష్ ప్రొడక్షన్స్‌ను ముందుగా చెప్పుకోవాలి. డి. రామానాయుడు ఉన్నంతకాలం ఈ బ్యానర్‌కు పోటీ అనేది లేదు. ఆ తరువాత ఈ బ్యానర్ డి సురేష్ బాబు చేతిలోకి వచ్చింది. కానీ ఎందువలనో ఏమో గానీ ఆయన తన తండ్రిలా వరుస చిత్రాలను నిర్మించడం లేదు. మరీ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.

  శుబ్‌మన్‌ గిల్‌: సచిన్‌ అల్లుడంటే ఆ రేంజ్‌ ఉంటది!

  దాంతో ఈ బ్యానర్ నుం వచ్చే చిత్రాల సంఖ్య కూడా విపరీతంగా తగ్గిపోయింది. సినిమాలు తీయడంపై సురేష్ బాబు పెద్దగా దృష్టి సారించడం లేదు. అందులోనూ ఆయన తీసిన కొన్ని చిత్రాలు పరాజయం పాలయ్యాయి. ఏది ఏమైనా తన తండ్రి రామానాయుడుకు ఉన్న గట్స్ సురేష్ బాబుకు లేవనే చెప్పాలి.

  హీరోగా గెటప్ శీను.. అప్పుడే లిప్ లాక్

  ఇక తాజాగా విషయానికి వస్తే రామానాయుడు మనవడు, సురేష్ బాబు తనయుడైన దగ్గుబాటి రానా దేశవ్యాప్తంగా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇటీవల కాలంలో మొదటగా పాన్ ఇండియా రేంజ్ హీరోగా ఎదిగిన హీరో అంటే దగ్గుబాటి రానా అనే చెప్పుకోవాలి.

  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్ చిత్రంతో తెలుగులో హీరోగా పరిచయమయ్యాడు. తర్వాత తమిళం, హిందీ భాషల్లో వివిధ సినిమాలు చేసి గుర్తింపును సాధించి పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్నాడు.

  ప్రముఖులు చనిపోతే చివరి చూపు చూడని నాగార్జున! భ‌య‌మా..లేక సెంటిమెంటా?

  ముఖ్యంగా బాహుబలి రెండు భాగాలలో ఆయన చేసిన భ‌ల్లాల దేవ పాత్ర విల‌నే అయిన‌ప్ప‌టికీ ఆయ‌న న‌ట‌న‌కు విపరీతమైన క్రేజ్‌ని తీసుకొని వచ్చింది. నేనే రాజు నేనే మంత్రి, కృష్ణం వందే జగద్గురుం, రుద్రమదేవి వంటి చిత్రాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి. కాగా ఇటీవల ఆయన తెలుగులో అరణ్య చిత్రం చేశాడు. ఈ చిత్రం విభిన్న‌మైన జోన‌ర్లో సాగే చిత్రం.

  ఇక Rana హీరోగా నటించిన చివరి చిత్రం ‘విరాటపర్వం’. ఇందులో హీరోయిన్‌గా సాయి పల్లవి నటించింది. కాన్సెప్ట్ బాగున్నప్పటికీ కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు. గతంలో గుణశేఖర్ రానా దగ్గుబాటితో హిరణ్య కశ్యప అనే చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. కానీ రానా ఆ చిత్రాన్ని కూడా ప‌క్క‌న పెట్టేశాడు. దీనిపై అస‌లు అప్‌డేట్సే లేవు. కొత్త చిత్రాలకు ఆయన సైన్ చేయడం లేదు. దీంతో ఆయన న‌ట‌న‌కు గుడ్ బై చెప్పాడని ప్రచారం సాగుతోంది.

  అనారోగ్య కారణాలతో ఆయన ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. రానా చాలాకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నాడు. గతంలో తల్లి తన కిడ్నీ కూడా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.  ఆయన అమెరికాలోనే ఉంటూ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ సమయంలో రానా విపరీతంగా బరువు తగ్గారు. అంతేకాక ఆయనకు పుట్టుకతోనే ఒక కన్ను కనిపించదు.

  కేతికా శర్మ.. అంత ఉన్నా ఏం లాభం?

  మొత్తంగా సినిమాలు మానేయాలనేలా రానా నిర్ణయం తీసుకున్నాడట. జీవితం కంటే కెరీర్ ముఖ్యం కాదని రానా దగ్గుబాటి భావిస్తున్నాడ‌ని స‌మాచారం. దాంతో చాలామంది రానా నిర్ణయమే సరైనది అంటున్నారు. ఇక ఆయన ప్రస్తుతం బాబాయి వెంకటేష్‌తో కలిసి రానా నాయుడు టైటిల్‌తో ఓ వెబ్ సిరీస్ చేశారు. ఇది హాలీవుడ్ సిరీస్‌కి రీమేక్.

  మించి పోతున్న ‘జాన్వీ’

  లిప్‌లాక్‌లతో ‘మాన్‌స్టర్‌’లో లెస్బియన్‌గా కేక పెట్టించిన మంచులక్ష్మి..!

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular