విధాత: సూర్యాపేట జిల్లా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాపర్తి శ్రీనివాస్ గౌడ్ పార్టీ పదవికి, బీజేపీకి రాజీనామా చేశారు. అనంతరం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
కాగా.. త్వరలోనే తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్ లు పాల్గొన్నారు.