Rashmika Mandanna | విధాత: సినిమాలు చేసింది తక్కువే అయినా కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్‌ని అందుకున్న హీరోయిన్ రష్మికా మందన్న. కెరియర్ బిగినింగ్‌లో ఎలాంటి సినిమాలు చేసినప్పటికీ.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో చేసిన ‘పుష్ప’ సినిమాతో.. పాన్ ఇండియా లెవల్లో స్టార్ హీరోయిన్ గుర్తింపును దక్కించుకుంది రష్మిక. ఇక పుష్ప తర్వాత రష్మిక చేస్తున్నవన్నీ పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. ప్రస్తుతం ఆమె నేషనల్ క్రష్ అనే ట్యాగ్‌తో రాజ్యమేలుతోంది. ప్రస్తుతం […]

Rashmika Mandanna |

విధాత: సినిమాలు చేసింది తక్కువే అయినా కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్‌ని అందుకున్న హీరోయిన్ రష్మికా మందన్న. కెరియర్ బిగినింగ్‌లో ఎలాంటి సినిమాలు చేసినప్పటికీ.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో చేసిన ‘పుష్ప’ సినిమాతో.. పాన్ ఇండియా లెవల్లో స్టార్ హీరోయిన్ గుర్తింపును దక్కించుకుంది రష్మిక. ఇక పుష్ప తర్వాత రష్మిక చేస్తున్నవన్నీ పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం.

ప్రస్తుతం ఆమె నేషనల్ క్రష్ అనే ట్యాగ్‌తో రాజ్యమేలుతోంది. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ చిత్రం ‘యానిమల్’ మూవీని పూర్తి చేసి, ప్రస్తుతం ‘పుష్ప2’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటుంది. ఈ రెండు ప్రాజెక్ట్స్ కాకుండా ‘రెయిన్ బో, D51’ మూవీస్‌లో కూడా ఆమె నటిస్తుంది. అయితే రష్మిక ఇప్పుడు ఓ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. అదెంటంటే..

బెస్ట్ ఏషియన్ యాక్ట్రస్ అవార్డ్‌కు రష్మిక నామినేట్ అయింది. ఫేమస్ సెప్టిమియస్ అవార్డ్స్ 2023 ఈ అవార్డ్‌ను ప్రకటించారు. ఇప్పటివరకు ఏ సౌత్ హీరోయిన్‌కి ఇలాంటి గౌరవం దక్కలేదంటే.. రష్మిక రేంజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

హీరోయిన్‌గా రష్మిక ఉండగా.. బెస్ట్ ఏషియన్ యాక్టర్ విభాగంలో మలయాళ నటుడు టోవినో థామన్ నిలిచాడు. ఈ అవార్డ్ ఫంక్షన్ నెదర్లాండ్స్ లోని ఆంస్టర్డమ్‌లో జరగనుంది. ఈ విషయం తెలిసి అభిమానులు రియాక్ట్ అవుతున్న తీరుకు రష్మిక ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. వారికి థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేస్తోంది.

ఇదంతా మీ ప్రేమ వల్లనే దక్కింది. అసలు ఊహించని సర్‌ప్రైజ్ ఇది. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని అభిమానులను ఉద్దేసించి తన ఆనందాన్ని తెలిపింది రష్మిక. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.

ప్రయాణించిన దూరం తక్కువే కావచ్చు కానీ ఆమె అందుకున్న శిఖరం గొప్పది. అభిమానుల అభిమానాన్ని అతి తక్కువ సమయంలోనే దక్కించుకోవడం రష్మికకు మాత్రమే సాధ్యమైంది. నిజంగా ఈ అవార్డు‌ను గెలిచి.. ఆమె వెళ్లి ఆ అవార్డ్ అందుకున్న తర్వాత రష్మిక రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

Updated On 8 Sep 2023 2:48 AM GMT
somu

somu

Next Story