Tuesday, January 31, 2023
More
  Homelatestముద్దుగుమ్మ.. రాశిఖన్నా ఈ రేంజిలో రెచ్చిపోతోందేంటి..!

  ముద్దుగుమ్మ.. రాశిఖన్నా ఈ రేంజిలో రెచ్చిపోతోందేంటి..!

  విధాత‌: రాశిఖన్నా… బొద్దుగా ముద్దుగా ఉండే ఈ గుమ్మడు సినీ ఎంట్రీ బాగానే జరిగింది. ఆ తర్వాత కూడా కొన్ని చిత్రాలలో స్టార్ హీరోల సరసన నటించింది. కానీ ఈమెతో పాటు పరిచయమైన హీరోయిన్లు టాప్ స్టార్ హీరోలతో దూసుకుని వెళ్తుంటే ఈమె కెరీర్ మాత్రం డోలాయమానంలో పడింది.

  అతి తక్కువ చిత్రాలతోనే జోరు చిత్రంలో తానే సొంతంగా పాటను పాడిన ఘనత ఈమె సొంతం. దాంతో ఈమె చాలా డెడికేటెడ్‌గా పేరు తెచ్చుకుంది. కానీ దానికి తగ్గ అవకాశాలు మాత్రం ఈమెకు దక్కడం లేదు. 2019లో మారుతీ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ నటించిన ప్రతిరోజు పండుగ చిత్రం తర్వాత ఈమెకు తెలుగులో హిట్ అనేదే లేదు. గోపీచంద్ పక్కా కమర్షియల్, నాగచైతన్య థాంక్యూ చిత్రాలు తీవ్రంగా నిరాశపర్చాయి.

  వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో చాలా బోల్డ్ రోల్ లో నటించింది. శృంగార సన్నివేశాలలో హద్దులు చెరిపేసింది. కానీ ఈ మూవీ ప‌రాజ‌య‌మ‌వ్వ‌డంతో ఈమె ప‌రిస్థితి ఇర‌కాటంలో పడింది. వ్ర‌తం చెడ్డా ఫ‌లితం ద‌క్క‌లేద‌నే సామెత ఈమెకి స‌రిగా సూట్ అవుతుంది.

  ఈ చిత్రం ఆమె కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపించింది. దాంతో ఈమధ్య ఆమె వరుసగా తమిళ చిత్రాలు చేస్తోంది. ప్రస్తుతం ఈమె ఫోకస్ బాలీవుడ్ పైకి మళ్ళింది. సిద్ధార్థ్ మల్హోత్రా కి జంటగా యోధా చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ స్పైత్రిల్లర్గా రూపొందుతోంది.

  ఈ ఏడాది జులై 7న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం ఈ భామ ఆశలన్నీ ఈ చిత్రం పైనే. ఈ సినిమా విజయం సాధిస్తే బాలీవుడ్లో ఆఫర్స్ పెరుగుతాయని గంపెడాశతో ఎదురుచూస్తోంది. ఈ మధ్యకాలంలో హీరోయిన్లు ఆఫర్స్ తగ్గే కొద్దీ గ్లామర్ డోస్ పెంచేస్తున్నారు.

  ఇలాగే వరుస పరాజయాలతో డీలాపడ్డ రాశి కన్నా తన పరువాలతో దర్శక నిర్మాతలకు వలవిసురుతోంది. ఓ పబ్లిక్ ఈవెంట్ కోసం రాశి ఖ‌న్నా ధరించిన డ్రెస్ హాట్ టాపిక్ గా మారింది. బ్యాక్ లెస్ క్లీవేజ్ షో తో వాతావరణం హీటెక్కిస్తోంది. చలికాలంలో కూడా మంటను రాజేస్తుంది. యువతకు చెమటలు పుట్టిస్తూ వాతావరణం హీటెక్కిస్తోంది. కాగా ప్రస్తుతం ఈమె డిజిటల్ సిరీస్ లపై దృష్టి పెట్టింది.

  ఈమె లేటెస్ట్ వెబ్ సిరీస్ ఫార్జి . ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ముంబైలో నిర్వహించారు. ఈ ఈవెంట్లో రాశి సూపర్ హాట్ గ్లామర్ గా దర్శనమిచ్చింది. ఫార్జి క్రైమ్ థ్రిల్ల‌ర్గా తెరకెక్కింది. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, కేకే మీనన్ ప్రధాన పాత్రలో పోషిస్తున్నారు. దీని ట్రైలర్ ఆకట్టుకుంది.

  ది ఫ్యామిలీ మెన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే దీన్ని తెరకెక్కించారు. ఫిబ్రవరి 10 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. దీనిలో రాశి కన్నా రోల్ ఎలా ఉంటుందనేది ఆసక్తి కలిగిస్తోంది. రాశి కన్నాకు ఇది రెండో వెబ్ సిరీస్. గతంలో ఆమె రుద్రా టైటిల్‌తో ఒక క్రైమ్ సిరీస్ చేసింది. అందులో విజయ్ దేవగన్ హీరోగా నటించాడు. కాగా రాశి ఖన్నా తాజాగా చేసిన క్లీవేజ్ షో ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular