Wednesday, March 29, 2023
More
    HomelatestRashmi Gautam | రష్మిని కుక్కని కొట్టినట్లు కొట్టాలన్న నెటిజన్‌..! అడ్రస్‌ చెబితే వస్తానన్న యాంకర్‌..!

    Rashmi Gautam | రష్మిని కుక్కని కొట్టినట్లు కొట్టాలన్న నెటిజన్‌..! అడ్రస్‌ చెబితే వస్తానన్న యాంకర్‌..!

    Rashmi Gautam | రష్మి గౌతమ్‌ అందరికీ సుపరిచితమే. అంద చందాలతో బుల్లితెరపై మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నది. ఈటీవీలో ప్రసారమయ్యే కామెడీ షో జబర్దస్త్‌లో యాంకరింగ్ చేస్తూ ఓ రేంజ్‌లో క్రేజ్ సంపాదించుకున్నది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు యాంకరింగ్‌గా చేస్తూ వస్తున్నది. రష్మికి మూగ జీవాలంటే ఎంతో ప్రేమో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కాగా, ఇటీవల అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తతున్నాయి. ఈ క్రమంలోనే పలువురు నెజిజన్లు జంతుప్రేమికురాలైన జబర్దస్త్‌ యాంకర్‌నూ కుక్కలదాడి ఘటనపై స్పందించాలని సోషల్‌ మీడియాలో ప్రశ్నించారు. అయితే, ఘటనపై రష్మి విచారం వ్యక్తం చేసింది.

    ఈ ఘటనలో ఆ బాలుడి తప్పేంలేదని, ఇది చాలా బాధాకరమైన విషయమని, అయితే ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పింది. అదే సమయంలో కుక్కల సంతాన ఉత్పత్తి నియంత్రణ, వ్యాక్సినేషన్, వాటికి సరైన వసతి కల్పించాలంటూ ట్వీట్‌ చేసింది. ఈ ట్వీట్‌పై నెటిజన్లు పలువురు పలు రకాలుగా స్పందించారు. కొందరు రష్మికి మద్దతు తెలుపగా.. మరికొందరు వ్యతిరేకంగా స్పందించారు. ఓ నెటిజన్‌ రష్మిని కుక్కతో పోలుస్తూ దారుణంగా కామెంట్‌ చేశారు. ‘ఈ కుక్క రష్మిని.. కుక్కని కొట్టినట్లు కొట్టాలి’ అంటూ వ్యాఖ్యానించాడు. సదరు నెటిజన్‌కు రష్మి సైతం ఘాటుగానే బదులిచ్చింది. ‘తప్పకుండా.. నీ అడ్రెస్ చెప్పు.. నేనే పర్సనల్‌గా వస్తాను. ఏం చేస్తావో చేస్తా. ఇది నా ఓపెన్ ఛాలెంజ్’ అంటూ స్పందించింది. ప్రస్తుతం ఈ కామెంట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular