Sunday, December 4, 2022
More
  Homelatestజబర్దస్త్‌కు ర‌ష్మీ గుడ్ బై.. కొత్త యాంకర్ ఎంట్రీ.. కానీ!

  జబర్దస్త్‌కు ర‌ష్మీ గుడ్ బై.. కొత్త యాంకర్ ఎంట్రీ.. కానీ!

  విధాత‌, సినిమా: బుల్లితెర మీద ప్రసారమవుతున్న ఖతర్నాక్ కామెడీ షో జబర్థస్త్ టీవీ షోస్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.గత 10 సంవత్సరాలుగా ఈటీవీలో ఈ కామెడీ షో నిర్విఘ్నంగా ప్రసారమవుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ షో ద్వారా చాలా మంది ఆర్టిస్టుల జాతకం మారిపోయింది. హీరోలుగా, కమెడియన్లుగా సినిమా ఫీల్డ్‌లో స్థిర పడ్డారు. దీంతో వారు జబర్థస్త్‌కు గుడ్‌బై చెప్పాల్సి వస్తుండగా కొందరు మత్రం అక్కడే సేద తీరుతున్నారు. ఇప్పటికే చమ్మక్ చంద్ర, అదిరే అభి, సుడిగాలి సుధీర్ లాంటి వారు టాటా చెప్పేశారు.

  మునుగోడులో TRS జయకేతనం.. గులాబీ వనమైన ఉమ్మడి నల్లగొండ

   

   

  ఈ క్రమంలో వెండితెర రంగమ్మత్త, బుల్లితెర అందాల భామ అనసూయ భరద్వాజ్ ‘జబర్దస్త్’కు వీడ్కోలు పలికిన తర్వాత ఆమె ప్లేసులోకి మల్లెమాల సంస్థ ఎవరిని తీసుకొస్తుంది? అని చాలా మంది ఎదురు చూడగా.. అన్ని రోజులు ఊరించి ఊరించి ‘ఎక్స్ట్రా జబర్దస్త్’కు యాంకరింగ్ చేస్తున్న రష్మీ గౌతమ్ చేతిలో గురువారం వచ్చే ‘జబర్దస్త్’ షో కూడా పెట్టారు.

  ఇదిలా ఉండగా తాజాగా ఇప్పుడు ‘జబర్దస్త్’ నుంచి రష్మీను తీసేశారు. జబర్దస్త్‌కు కొత్త యాంకర్‌ను తీసుకు వచ్చారు. రష్మీను తీసేసి.. ప్రతి గురువారం వచ్చే ప్రోగ్రాం కోసం ఆ సోఫాలో మరో అందాల భామను కూర్చోబెట్టారు. దాంతో రష్మీ లేటెస్ట్ ‘జబర్దస్త్’ జర్నీ నాలుగు నెలల్లో ముగిసింది.

   

   

  కాగా.. ఈటీవీలో ప్రసారమ‌వుతున్న ‘శ్రీమంతుడు’ సీరియల్‌లో నటించిన సౌమ్య రావు అనే ఆర్టిస్ట్‌ను జబర్దస్త్’కు తీసుకురాగా కొత్త యాంకర్‌గా ఇంద్రజ పరిచయం చేశారు. నవంబర్ 10 నుంచి ప్ర‌సారం కానున్న ఎపిసోడ్స్‌కు సౌమ్య యాంకర్‌గా చేయనున్నారు. తాజాగా ‘జబర్దస్త్’ కొత్త ప్రోమో విడుదల అయ్యింది. అయితే.. జబర్దస్త్‌కు సౌమ్యను తీసుకు వచ్చినా.. ‘ఎక్స్ట్రా జబర్దస్త్’కు మాత్రం రష్మీని కంటిన్యూ చేశారు.

   

   

  అయితే జబర్దస్త్ నుంచి రష్మీని ఎందుకు తీసేశారు? అనే దానిపై ఇప్పుడు బాగా చర్చ నడుస్తోంది. రష్మీ కథానాయికగా నటించిన ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ సినిమా ఈ వారం విడుదల అవగా మరికొన్ని సినిమాలు చేతిలో ఉన్నాయట. ప్రస్తుతం ‘ఎక్స్ట్రా జబర్దస్త్’తో పాటు ‘శ్రీ దేవి డ్రామా కంపెనీ’కి కూడా రష్మీ గౌతమ్ యాంకరింగ్ చేస్తున్నారు. టీవీ షోస్ ఎక్కువైతే సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేయడం ఇబ్బంది అవుతుందేమోనని ముందు జాగ్రత్త పడుతున్నదని టాక్.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular

  You cannot copy content of this page