Rashmika | ఈ కాలం నాటి అందాల ముద్దుగుమ్మ‌లు ఫిట్ నెస్ విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తున్న విష‌యం తెలిసిందే. బిజీ షెడ్యూల్ స‌మ‌యంలోను కొంత స‌మ‌యం వ‌ర్క‌వుట్స్‌కి కేటాయించి తాము ఫిట్‌గా క‌న‌బ‌డే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. తాజాగా ర‌ష్మిక వ‌ర్కవుట్‌కి సంబంధించిన వీడియో ఒక‌టి ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇందులో ర‌ష్మిక‌.. లెగ్స్ వర్కౌట్ చేస్తూ కనిపించ‌గా, ఆమె హెవీ వెయిట్ ను కాళ్లతో లిఫ్ట్ చేస్తూ కండరాలను మరింత బలంగా ఉంచుకునే ప్ర‌య‌త్నం […]

Rashmika |

ఈ కాలం నాటి అందాల ముద్దుగుమ్మ‌లు ఫిట్ నెస్ విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తున్న విష‌యం తెలిసిందే. బిజీ షెడ్యూల్ స‌మ‌యంలోను కొంత స‌మ‌యం వ‌ర్క‌వుట్స్‌కి కేటాయించి తాము ఫిట్‌గా క‌న‌బ‌డే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. తాజాగా ర‌ష్మిక వ‌ర్కవుట్‌కి సంబంధించిన వీడియో ఒక‌టి ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది.

ఇందులో ర‌ష్మిక‌.. లెగ్స్ వర్కౌట్ చేస్తూ కనిపించ‌గా, ఆమె హెవీ వెయిట్ ను కాళ్లతో లిఫ్ట్ చేస్తూ కండరాలను మరింత బలంగా ఉంచుకునే ప్ర‌య‌త్నం చేస్తుంది. ఇందుకోసం ర‌ష్మిక చాలా క‌ష్ట‌ప‌డుతుంది. ఒక‌వైపు భ‌రించ‌లేని నొప్పి క‌లుగుతున్నా కూడా త‌గ్గేదే లే అంటూ వ‌ర్క‌వుట్స్ చేసింది.

రష్మిక ఫిట్ నెస్ విషయంలో ఏ నాడు అశ్ర‌ద్ధ వ‌హంచ‌దు. ప్రతిరోజూ, షూటింగ్ స్పాట్ లోనూ ఎక్సర్ సైజ్ చేస్తూ ఫిట్‌గా ఉండేందుకు కృషి చేస్తుంటుంది. నాజుగ్గా ఉండాలంటే ఇలా గంటల కొద్ది జిమ్ లో శ్రమించాల‌ని తెలుసుకున్న ర‌ష్మిక నిత్యం జిమ్‌లో బిజీగా గ‌డుపుతూ ఉంటుంది.

వెండితెరపై మరింత ఫిట్ గా, అందంగా మెరిసేందుకు ఈ అమ్మ‌డు చేస్తున్న‌ కృషికి ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లూ ఫిదా అవుతున్నారు. మ‌రి ర‌ష్మిక‌కి నేషనల్ క్రష్ ఊరికే కాలేదంటూ.. ఇంత డెడికేషన్, హార్డ్ వర్క్ ఉంది కాబట్టే ఆమెకి ఆ ఖ్యాతి వ‌చ్చింద‌ని చెబుతున్నారు.

ఇక ర‌ష్మిక‌కి ఈ మ‌ధ్య కాలంలో పెద్ద‌గా స‌క్సెస్‌లు రావ‌డం లేదు. ప్ర‌స్తుతం అల్లు అర్జున్ సరసన ‘పుష్ప2 : ది రూల్’ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. అలాగే బాలీవుడ్ స్టార్ ‘యానిమల్’లో క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ ముద్దుగుమ్మ‌.. తెలుగులో ‘రెయిన్ బో’ అనే సినిమా కూడా చేస్తుంది.

పుష్ప త‌ర్వాత ఈ బ్యూటీకి ఆఫ‌ర్స్ క్యూ క‌ట్టాయి. హిందీలో వరుస చిత్రాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న ఇప్పటికే గుడ్ బై, మిషన్ మజ్ను చిత్రాలతో నార్త్ అడియన్స్ ను కూడా ఎంత‌గానో అల‌రించింది. అప్పుడప్పుడు సోష‌ల్ మీడియాలో త‌న గ్లామ‌ర్‌తో మ‌త్తెక్కిస్తూ కూడా ఉంటుంది.

Updated On 16 Sep 2023 2:19 AM GMT
sn

sn

Next Story