Rasi Phalalu Today | దిన ఫలాలు చంద్రచారము ఆధారంగా తేదీ: 04.06.2023; చంద్రచారము 3.21 గంటల వరకు వృశ్చిక రాశి, తదుపరి ధనూరాశి. Horoscope | జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించే వారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్‌ చేసుకుంటుంటారు. వారి కోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.. మేషరాశి : చంద్రుడు 3.21 గంటల వరకు 8వ […]

Rasi Phalalu Today | దిన ఫలాలు చంద్రచారము ఆధారంగా
తేదీ: 04.06.2023; చంద్రచారము 3.21 గంటల వరకు వృశ్చిక రాశి, తదుపరి ధనూరాశి.

Horoscope | జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించే వారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్‌ చేసుకుంటుంటారు. వారి కోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషరాశి : చంద్రుడు 3.21 గంటల వరకు 8వ ఇంట (ప్రతికూలం) ఉంటున్నందున స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి. కొన్ని ఆర్థిక, నష్టాలు, వృత్తిపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు.

తదుపరి 9వ ఇంట (ప్రతికూలం)కు మారుతున్నందున స్వల్ప నష్టాలు, వృత్తిపరమైన ఇబ్బందులతో మనసు ఉద్వేగంతో, విచారంతో ఉంటుంది.

వృషభరాశి : చంద్రుడు 3.21 గంటల వరకు 7వ ఇంట (సానుకూలం) ఉంటున్నందున ఆర్థిక, గృహ, కుటుంబ విషయాల్లో సాఫల్యాలు ఆశించవచ్చు.

తదుపరి 8వ ఇంటకు (ప్రతికూలం) మారుతున్నందున వృత్తపరంగా కొన్ని సమస్యలు, ఆర్థికంగా నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉన్నది. ఫలితంగా స్వల్ప ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

మిథునరాశి : చంద్రుడు 3.21 గంటల వరకు 6వ ఇంట (సానుకూలం) ఉంటున్నందున ఆర్థిక, గృహ, ఆరోగ్య విషయాల్లో చెప్పుకోతగిన మార్పులు కనిపిస్తాయి.

తదుపరి 7వ ఇంటకు మారుతున్నందున సానుకూల పరిణామాలే ఉంటాయి. ఆర్థిక, వృత్తి, కుటుంబ, ఆరోగ్య విషయాల్లో సాఫల్యాలు ఉంటాయి.

కర్కాటక రాశి : చంద్రుడు 3.21 గంటల వరకు 5వ ఇంట (ప్రతికూలం) ఉంటున్నందున స్వల్ప నష్టాలు, సమస్యలు, టెన్షన్లతో మనసు వేదనతో ఉంటుంది.

తదుపరి చంద్రుడు 6వ ఇంటకు మారుతున్నందున ఆర్థిక, వృత్తి, ఆరోగ్యం, కుటుంబ విషయాల్లో విజయాలు సాధిస్తారు.

సింహ రాశి : చంద్రుడు 3.21 గంటల వరకు 4వ ఇంట (ప్రతికూలం) ఉంటున్నందున స్వల్ప నష్టాలు, కుటుంబ సమస్యలు ఎదురవుతాయి. ఫలితంగా వివాదాలు, శత్రుత్వాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నది.

తదుపరి చంద్రుడు 5వ ఇంటకు మారుతున్నందున ప్రతికూల ప్రభావాలు కలుగవచ్చు. కొన్ని స్వల్ప నష్టాలు ఉంటాయి. కుటుంబపరంగా సమస్యలు తలెత్తి మనసంతా టెన్షన్‌తో ఉంటుంది.

కన్యా రాశి : చంద్రుడు 3.21 గంటల వరకు 3వ ఇంట ఉండటం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. వృత్తిపరంగా సవ్యంగా ఉంటుంది. కుటుంబ విషయాలు సంతోషకరంగా ఉంటాయి.

తదుపరి నాలుగవ ఇంటకు మారుతున్నందున ప్రతికూలతలు చోటు చేసుకోవచ్చు. స్వల్ప నష్టాలు, సమస్యలతో వివాదాలు, శత్రుత్వాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నది.

తులా రాశి: చంద్రుడు 3.21 గంటల వరకు 2వ ఇంట ఉంటున్నందున ప్రతికూలతలు కనిపిస్తాయి. కొన్ని స్వల్ప నష్టాలు, వృత్తిపరమైన విషయాలతో మనసు టెన్షన్‌తో, దిగులుతో ఉంటుంది.

తదుపరి 3వ ఇంటకు మారుతున్నందున సానుకూల ఫలితాలు కలుగుతాయి. ఆర్థిక, గృహ, కటుంబ విషయాల్లో సానుకూల సందర్భాలు చోటు చేసుకుంటాయి.

వృశ్చిక రాశి : చంద్రుడు 3.21 గంటల వరకు 1వ ఇంట ఉండటం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఆర్థిక, వృత్తి, కుటుంబ విషయాల్లో సానుకూలంగా ఉంటుంది.

తదుపరి 2వ ఇంటకు మారుతున్నందున స్వల్ప ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటారు. ఇన్ని సమస్యలు తలెత్తుతాయి. దీని వలన టెన్షన్‌కు, దిగులుకు గురవుతారు.

ధనూ రాశి : చంద్రుడు 3.21 గంటల వరకు 12వ ఇంట ఉండటం ప్రతికూలతలు కలిగిస్తుంది. కొన్ని వృత్తిపరమైన సమస్యలు, వ్యాపార విషయాల్లో ఇబ్బందుల కారణంగా అనుకోని ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉన్నది.

తదుపరి 1వ ఇంటకు మారుతున్నందున సానుకూలంగా ఉంటుంది. ఆర్థిక, వృత్తి, కుటుంబ విషయాల్లో సానుకూల ఘటనలు ఉంటాయి.

మకర రాశి : చంద్రుడు 3.21 గంటల వరకు 11వ ఇంట ఉంటుండటం శుభప్రదం. వృత్తి, వ్యాపార రంగాల్లో లాభదాయకంగా ఉంటుంది.

తదుపరి 12వ ఇంటకు మారుతున్నందున ప్రతికూలతలు కనిపించే అవకాశం ఉన్నది. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉన్నది. దాని ప్రభావం కుటుంబ, ఆస్థి విషయాలపై కనిపించవచ్చు.

కుంభ రాశి : చంద్రుడు 3.21 గంటల వరకు 10వ ఇంట ఉండటం శుభప్రదం. గృహ, ఆరోగ్య, కుటుంబ విషయాల్లో చెప్పుకోతగిన మార్పులు తెస్తుంది.

తదుపరి 11వ ఇంటకు మారడం శుభాలను కలిగిస్తుంది. గృహ, కుటుంబ విషయాల్లో లాభదాయక పరిణామాలు చోటు చేసుకుంటాయి.

మీన రాశి : చంద్రుడు 3.21 గంటల వరకు 9వ ఇంట ఉండటం ప్రతికూలతలు కలిగిస్తుంది. కొన్ని స్వల్ప నష్టాలు, సమస్యలతో మనసు వేదనతో, విచారంతో ఉంటుంది.

తదుపరి 10వ ఇంటకు మారుతున్నందున సానుకూల వాతావరణం నెలకొంటుంది. ఆర్థిక, వృత్తి, కుటుంబ, ఆరోగ్య విషయాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి.

సూచిక: చంద్రుడు నిరంతరం భూమి చుట్టూ తిరుగుతున్నందున, దాని తాత్కాలిక ప్రభావం రోజులో ఏ సమయంలోనైనా మారవచ్చు. అందువల్ల, మారిన ప్రభావం దాని సమయంతో సూచించడమైనది.

ప్రభావాలు అనుకూలంగా ఉన్నాయా? లేదా ప్రతికూలంగా ఉన్నాయా? అనేది కూడా కూడా పేర్కొనడమైనది. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి.

Updated On 4 Jun 2023 3:02 AM GMT
Somu

Somu

Next Story