విధాత: తెలుగులో హాస్యం ఒకప్పుడు చాలా హుందాగా ఉండేది. పాత కాలంతో పాటు జంధ్యాల, రేలంగి నరసింహారావు వంటి వారి హయాంలో హాస్యం హాస్యంగానే ఉంటూ.. అందరినీ అలరించేది. సాధారణ జనాల్లో ఉన్న మేనరిజమ్స్.. వారి అలవాట్లను తీసుకుని ఎవరిని కించపరచకుండా ఉండేలా వారు సినిమాలు తీసేవారు. వారు ఆ తరహా హాస్య పాత్రలను సృష్టించే వారు.
కానీ రాను రాను ఏదో బూతులు మాట్లాడటం, ఎదుటివారిని కామెంట్ చేయడం, సెటైర్లు వేయడం, వారి బాడీలోని అంగాల గురించి కామెంట్ చేయడం మొదలుపెట్టారు. ఈ బాడీ షేమింగ్ అనేది ముఖ్యంగా బుల్లితెరపై కామెడీ షోలు వచ్చాక మరింత ఎక్కువయింది.
జబర్దస్త్ షోలో దీనికి అడ్డు అదుపు లేకుండా సాగింది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలలో ఎదుటివారిని బాడీ షేమింగ్ చేస్తూ ఆటపట్టించి, హాస్యం పండించడం చూస్తూనే ఉన్నాం. ఇక నాటి కాలానికి నేటి కాలానికి హాస్యంలో ఉన్న తేడాను ఓ రెండు సినిమాలను పోల్చి చెప్తే అర్థమవుతుంది.
జంధ్యాల తీసిన ఓ చిత్రంలో శ్రీలక్ష్మి మరణించిన తన కొడుకుని ఊహించుకుంటూ కనిపించిన అందర్నీ ‘బాబూ చిట్టి’ అంటూ కౌగిలించుకొని వారితో మాట్లాడుతూ ఏడుస్తూ ఉంటుంది. అదే ఇటీవల మంచు విష్ణు హీరోగా వచ్చిన చిత్రంలో ఓ బ్రాహ్మణ స్త్రీ ఎవర్ని చూసినా తన భర్త అనుకొని కౌగిలించుకోవడం చూపించారు. ఈ రెండింటిని పోలిస్తే ఏది సభ్యమో ఏది అసభ్యమో అర్థం అవుతుంది.
ఇక విషయానికొస్తే తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఓ కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. వాస్తవానికి టాలీవుడ్ హాట్ యాంకర్లలో రష్మీకి తెలుగు సరిగా రాదు. కానీ అలాగని ఆమె మరీ ఫైర్ బ్రాండ్‌గా తనను కామెంట్ చేసే వారిపై విరుచుకు పడకుండా స్పోర్టివ్‌గా తీసుకుంటుంది.
అంటే అనసూయలాగా కాకుండా కాస్త కోపాన్ని అదుపులో ఉంచుకుంటుంది. అదే అనసూయ అయితే తనను బాడీ షేమింగ్ చేసినా, తన గురించి ఎవరు వంక పెట్టినా ఎడాపెడా వాయించేస్తుంది. కానీ పాపం రష్మి అలా కాదు. ఆమె తెలుగు మాట్లాడుతుంటే అది తెలుగులా ఉండదు.
దీంతో ఆమెను టీవీ షోలోని కమెడియన్లే కాదు.. ఇతర ఛానళ్లలో నటులు కూడా ఏడిపిస్తుంటారు. అలాగని ఆమె మనోభావాలు దెబ్బతినవా అంటే దెబ్బతింటాయి. కోపం వస్తుందా అంటే వస్తుంది. కానీ ఆమె వాటిని స్పోర్టివ్‌గా తీసుకుని ముందుకు సాగుతూ ఉంటుంది. అలాగని మరీ ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలు చేయడం సమంజసమా?
ఇక న్యూ ఇయర్ సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీలో న్యూ ఇయర్ స్కూల్ డేస్ అనే ఎపిసోడ్‌ని ప్లాన్ చేయగా అందులో పార్టిసిపెంట్స్ అయిన నటులు, యాంకర్ స్కూలు పిల్లలలాగా మారిపోయి సందడి చేశారు. అమ్మాయిలు స్కర్టులు వేసుకుంటే అబ్బాయిలు చెడ్డీలు వేసుకొని వచ్చారు.
ఎలాంటి డ్రెస్సులు అయినా తన హాట్ నెస్ తగ్గకుండా చూసుకునే రష్మీ.. ఎపిసోడ్లో యూనిఫామ్ గెటప్‌లో చాలా బాగా కనిపించింది. అయితే ఆమెను చూసిన కమెడియన్ రాంప్రసాద్, ఇమాన్యుయల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
పోర్న్ రంగం గురించి ఐడియా ఉన్న వాళ్లకి మియా కలీఫా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు రష్మీని.. రాంప్రసాద్ మియా కలీఫాతో పోల్చాడు. దీంతో ఆమె కోపగించుకోకుండా కాస్త తమాయించుకుని ఓ నవ్వు నవ్వి ఊరుకుంది. కానీ పక్కనున్న ఇంద్రజ మాత్రం విసుక్కుంది. ఈ ప్రోమో, షో చూసిన అభిమానులు ఇదేంటి ఇలా అనేశాడు. మరీ హాస్యం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయాలా? ఇలాంటి సెటైర్స్ వేయాలా? అంటూ మండిపడుతున్నారు.
కామెడీ చేయడానికి బాడీ షేమింగ్ చేయడం జబర్దస్త్ బ్యాచ్‌కి మొదటి నుంచి అలవాటు అయితే దీనికోసం ఇలాంటి అడ్డదిడ్డమైన పోలికలు పెట్టడం మాత్రం సరికాదని నెటిజన్లు అంటున్నారు. మరి రష్మీ అయితే స్పోర్టివ్‌గా తీసుకుని నవ్వుకుంది కానీ.. ఇలా పదే పదే రష్మీని టార్గెట్ చేయడం మాత్రం కరెక్ట్ కాదంటూ ఆమె అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.