Bigg Boss7 | బిగ్ బాస్ సీజన్ 7 అంతా ఉల్టా పుల్టా అని నాగ్ ముందు నుండి చెబుతూనే ఉన్నారు. ఆయన చెప్పి నట్టుగానే కంటెస్టెంట్స్ ప్రవర్తన చూస్తుంటే అంతా పుల్టా మాదిరిగానే కనిపిస్తుంది. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు ఒక్కో టైపులో తమ శాడిజాన్ని చూపిస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నారు. కెమెరా ఫోకస్ అంతా నా మీద అంటే నా మీద ఉండాలి అన్నట్లుగా పోటీ పడుతున్నారు. అయితే బిగ్ […]

Bigg Boss7 |
బిగ్ బాస్ సీజన్ 7 అంతా ఉల్టా పుల్టా అని నాగ్ ముందు నుండి చెబుతూనే ఉన్నారు. ఆయన చెప్పి నట్టుగానే కంటెస్టెంట్స్ ప్రవర్తన చూస్తుంటే అంతా పుల్టా మాదిరిగానే కనిపిస్తుంది. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు ఒక్కో టైపులో తమ శాడిజాన్ని చూపిస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నారు.
కెమెరా ఫోకస్ అంతా నా మీద అంటే నా మీద ఉండాలి అన్నట్లుగా పోటీ పడుతున్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ 7లో ఆట సందీప్ మొదట పవర్ అస్త్ర అందుకున్నాడు. ఇప్పుడు పవర్ అస్త్ర అందుకునే రెండో కంటెస్టెంట్ కోసం పోటీ నడుస్తుంది. ఈ పోటీలో రెండవ పవర్ అస్త్ర దక్కించుకునేందుకు అర్హులుగా ఎక్కువ అస్త్రాలు భాగాలూ సాధించిన శివాజీ, షకీలా ఉన్నారు.
అయితే గత ఎపిసోడ్‌లో నానా రచ్చ చేసిన రతిక తాజాగా మరోసారి అందరికి విసుగు తెప్పించింది. షకీలా కంటే ప్రిన్స్ యావర్ జెన్యూన్ గా అర్హుడు అని చెబితే తనని అందరు కార్నర్ చేస్తున్నారు అంటూ మళ్లీ గొడవ పడింది.
ఇక ఇన్నాళ్లు సైలెంట్‌గా కనిపించిన యావర్ తనకి అవకాశం దక్కలేదని, సిల్లీ రీజన్స్ చెప్పి తనని తప్పిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కన్నీరు పెట్టుకున్నాడు. మహాబలి టీంకి చెందిన .. యావర్ దగ్గరి నుంచి మాయాస్త్రను తీసుకొని, దానికి సరైన కారణం చెప్పలేకపోయాడు.. దీంతో యావర్ రెచ్చిపోయాడు. ఇద్దరూ కొట్టుకుంటారా అనేలా గొడవపడ్డారు.
ఇక రెండవ పవర్ అస్త్ర పోటీలో ఇప్పటికే శివాజీ, షకీలా అర్హత సాధించడంతో మూడవ పోటీదారుడిని నేరుగా ఎంచుకునే అవకాశాన్ని బిగ్ బాస్ పవర్ అస్త్ర దక్కించుకున్న సందీప్ కి ఇచ్చారు. దీనితో సందీప్.. అమర్ పేరు చెప్పడంతో రెండవ పవర్ అస్త్ర కోసం అమర్, శివాజీ, షకీలా ముగ్గురూ బరిలో నిలిచారు. అయితే వీరి ముగ్గురుకి బిగ్ బాస్ పవర్ అస్త్ర పోటీ కోసం ఒక ఆసక్తికర టాస్క్ ఇచ్చారు.
ఒక పెద్ద చెవి ఉన్న బొమ్మని గార్డెన్ ఏరియాలో ఉంచి.. ఆ చెవిలో ఒకరితర్వాత ఒకరు గట్టిగా బిగ్ బాస్ అని అరుస్తూ… ఎవరిది పెద్ద గొంతో తేల్చుకోవాలి అని పేర్కొన్నాడు బిగ్ బాస్. దీనితో శివాజీ, షకీలా, అమర్ ముగ్గురూ ఒకరితర్వాత ఒకరు పలుమార్లు గట్టిగా బిగ్ బాస్ అని అరుస్తూ వచ్చారు. అయితే ఈ పోటీలో ఎవరు గెలిచి పవర్ అస్త్ర పొందిన రెండో కంటెస్టెంట్‌గా నిలుస్తారనేది నేటి ఎపిసోడ్‌లో తెలియనుంది.
