Ravi Kishan | సినిమాల్లో నటించాలని, తమను తాము వెండితెరపై చేసుకోవాలని ఎంతో మంది కల. ఈ కలను సాకారం చేసుకునేందుకు పరిశ్రమలోకి వస్తారు. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ స్టూడియోలు, దర్శకులు, నిర్మాతల చుట్టూ తిరుగుతుంటారు. ఇందులో అవకాశాలు దక్కేది కొందరికే. కొందరికి అవకాశాలు దక్కినా.. చివరకు ఆ సినిమాలో వచ్చిన పాత్రను బట్టే గుర్తింపు దక్కుతూ ఉంటుంది. తర్వాత అవకాశాలు లేక పరిశ్రమను వీడుతుంటారు.
మరికొందరు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే, క్రమంలో తాము క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నట్లు బహిరంగంగానే తెలిపారు. అయితే, మొన్నటి వరకు నటీమణులకే క్యాస్టింగ్ కౌచ్ నటీమణులకే కాదని.. నటులకు తప్పడం లేదని ‘రేసుగుర్రం’ నటుడు రవికిషన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘రేసుగుర్రం’ చిత్రంతో టాలీవుడ్‌లోకి విలన్‌గా ఎంట్రీ ఇచ్చిన రవికిషన్ సినిమా పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో ఓ మహిళ తనను వాడుకోవాలని చూసిందని తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవికిషన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలన విషయాలు వెల్లడించాడు. ‘క్యాస్టింగ్ కౌచ్ అనేది సినిమా ఇండస్ట్రీలో ఉంది. నేను దాన్ని ఎదుర్కొన్నారు. అయితే, దాన్ని నుంచి తప్పించుకున్నారు. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఓ మహిళ నన్ను రాత్రికి కాఫీ తాగేందుకు రమ్మన్నది.
ఆమె మాటలు నాకు పూర్తిగా అర్థమయ్యాయి. నేను వెంటనే నో చెప్పాను. ప్రస్తుతం ఆ మహిళ పెద్ద స్థాయిలో ఉంది’ చెప్పుకొచ్చారు. అయితే, అవకాశాల కోసం అడ్డదారులు తొక్కకుండా నిజాయితీగా ఉండాలని తన తండ్రి చెప్పాడని తెలిపారు.
సినిమాల్లోకి రావడం ఆయనకు ఇష్టం లేదని, తన తల్లి మాత్రం సపోర్ట్ చేసిందంటూ పరిశ్రమలో తనకు ఎదురైన అనుభవాలను వివరించారు. రవికిషన్ భోజ్‌పూరి చిత్ర పరిశ్రమలో ఫేమస్ నటుడు. ఆ తర్వాత తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లో తన నటనతో అందరినీ మెప్పించాడు.
తెలుగులో ‘రేసుగుర్రం’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును పొందారు. రవి కిషన్ అసలు పేరు రవీంద్ర శ్యామ్‌నారాయణ్ శుక్లా. 2014లో రాజకీయాల్లోకి ప్రవేశించిన రవికిషన్.. 2019లో ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానానికి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు.