మోడీ పాలనలో పెరిగిన ధరలు సీఎం కేసీఆర్ హామీలు అమలు కాలేదు.. ఏఐసీసీ పరిశీలకులు రవీందర్ దళ్వీ Ravindra Dalvi | విధాత, వరంగల్: విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన హామీలను అమలు చేయడంలో బీజేపీ ప్రభుత్వం విఫలం చెందిందని ఏఐసీసీ అబ్జర్వర్, వరంగల్ పార్లమెంట్ ఇంచార్జి రవీంద్ర ఉత్తమ్ రావు దళ్వి మండిపడ్డారు. కాంగ్రెస్ సంకల్ప యాత్రలో భాగంగా హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి చేపట్టిన పాదయాత్రను సోమవారం […]

  • మోడీ పాలనలో పెరిగిన ధరలు
  • సీఎం కేసీఆర్ హామీలు అమలు కాలేదు..
  • ఏఐసీసీ పరిశీలకులు రవీందర్ దళ్వీ

Ravindra Dalvi | విధాత, వరంగల్: విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన హామీలను అమలు చేయడంలో బీజేపీ ప్రభుత్వం విఫలం చెందిందని ఏఐసీసీ అబ్జర్వర్, వరంగల్ పార్లమెంట్ ఇంచార్జి రవీంద్ర ఉత్తమ్ రావు దళ్వి మండిపడ్డారు. కాంగ్రెస్ సంకల్ప యాత్రలో భాగంగా హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి చేపట్టిన పాదయాత్రను సోమవారం ఆయన అంబేద్కర్ విగ్రహం సెంటర్లో ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ మోడీ పాలనలో దేశంలో నిత్యావసర వస్తువులు, పెట్రోల్, గ్యాస్, డీజిల్ రేట్ల పెంపుతో మధ్యతరగతి కుటుంబాల బతుకు భారమైందని విమర్శించారు.పేదరికం, నిరుద్యోగ రేటు తీవ్ర స్థాయికి చేరాయని అన్నారు. మేకిన్ ఇండియా, హర్ ఘర్ జల్, ఆత్మనిర్భర్ భారత్ లాంటి మోడీ మాటలు నీటి మీద రాతలుగా మిగిలిపోయాయని ఎద్దేవా చేశారు.

బీఆర్ఎస్ పాలనలో తెలంగాణాలో అభివృద్ధి అంత ఒక కేసీఆర్ కుటుంబానికే పరిమితమైందని విమర్శించారు. తొమ్మిదేండ్ల పాలనలో ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ వరంగల్ కు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదన్నారు. వరంగల్ నగరాన్ని వాషింగ్టన్ చేస్తామంటూ ఇచ్చిన హామీ ఏమయిదని ప్రశ్నించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాబోయే రోజుల్లో ఈ రెండు ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

అభివృద్ధిపై ప్రశ్నిస్తే కాంగ్రెస్ పై దాడులు

అభివృద్ధిపై ప్రశ్నిస్తే… నిలదీస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారని నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ విమర్శించారు. స్థానిక ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యంతో హన్మకొండ వాసులకు అభివృద్ధి ఫలాలు అందని ద్రాక్షలా మారాయన్నారు. నిరుపేదలకు డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం కలగానే మిగిలింది. ఎమ్మెల్యేలు, అతని అనుచరుల భూకబ్జాలు మితిమీరుతున్నాయని ఆరోపించారు.

సమావేవంలో డివిజన్ అధ్యక్షులు వల్లపు రమేష్, డివిజన్ సీనియర్ నాయకుడు బొంత సారంగం, పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు, ఈవీ శ్రీనివాస్ రావు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కూచన రవళి, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్, రహీమున్నిసా బేగం, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు మిర్జా అజీజుల్లా బేగ్, బంక సరళ, డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, కూర వెంకట్, బొమ్మతి విక్రం, పల్లకొండ సతీష్, గుంటి స్వప్న పాల్గొన్నారు.

Updated On 5 Sep 2023 2:43 AM GMT
somu

somu

Next Story