Tuesday, January 31, 2023
More
    Homelatestరవితేజ పాత్రను.. పవన్ చేత చేయించాల‌నుకున్నారా..?

    రవితేజ పాత్రను.. పవన్ చేత చేయించాల‌నుకున్నారా..?

    విధాత: వాల్తేరు వీరయ్య చిరంజీవి స్టామినాని మరోసారి నిరూపిస్తూ ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గాని ప్రేక్షక ఆదరణ గాని కించిత్తు కూడా తగ్గలేదని నిరూపిస్తోంది. ఈ చిత్రం ఆడే దియేటర్లు ఫ్యామిలీ ఆడియన్స్ తో కిక్కిరిసిపోతున్నాయి. దీన్ని అందరూ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అన్నారు. కానీ ఈ చిత్రాన్ని ఎక్కువగా ఆదరిస్తుంది ఫ్యామిలీ ఆడియన్స్. ముసలి వారి నుంచి చిన్న పిల్లల వరకు ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తున్నారు.

    కానీ కొందరు పని కట్టుకొని ఈ చిత్రం డిజాస్టర్ అంటూ ప్రచారం చేశారు. కానీ వారికి ఇప్పుడు ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి నోట మాట రావడం లేదంటే అతిశయోక్తి కాదేమో. చిరు ఎంటర్టైన్మెంట్ జోన్లోకి అడుగు పెడితే బాక్సాఫీస్ ఎలా బద్దలవుతుందో మరోసారి ఈ వాల్తేరు వీరయ్యతో నిరూపితం అవుతోంది.

    ఇక ఈ చిత్రంలోని సెకండ్ హాఫ్ ను ఓ రేంజి లోకి తీసుకొని వెళ్లడంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించారు. విక్రమార్కుడు తర్వాత రవితేజను అంత పవర్ఫుల్ గా చూపించిన చిత్రమిది. ముఖ్యంగా రవితేజ నటించిన పలు సీన్స్ ప్రేక్షకులకు కన్నీరు తెప్పిస్తాయి. ఈ రేంజ్ లో ఆయన ఎమోషన్స్ పండించాడు. ఆయన ఎంట్రీ తోనే ఈ చిత్రం పీక్స్ కి వెళ్ళింది.

    అయితే మొదట ఈ పాత్ర కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని తీసుకోవాలని బాబి అనుకున్నారట. కానీ ఈ చిత్రం క్లైమాక్స్ లో రవితేజ పాత్ర చనిపోతుంది. దాంతో చిరు పవన్ చేస్తే పెద్దగా నచ్చకపోవచ్చు. దీనిని పవన్ ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారో..? సినిమాకే రిస్క్ అని వద్దని చెప్పాడట. ఆ తర్వాత రవితేజను చిరునే స్వయంగా సజెస్ట్ చేసి ఒప్పించారు. దాని ఫలితమే నేడు వాల్తేరు వీరయ్య సృష్టిస్తున్న ప్రభంజనానికి మూల కారణమైంది.

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular