Raja Singh విధాత: తనతో కలిసి మంత్రి కేటీఆర్ రజాకార్స్ ఫైల్స్ సినిమా చూడటానికి రావాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి కేటీఆర్‌కు నిజాం పాలన చరిత్ర తెలియదన్నారు. తన తండ్రి కేసీఆర్‌ను అడిగి మీర్ ఉస్మాన్ అలిఖాన్ అరాచకాల గురించి కేటీఆర్ తెలుసుకోవాలన్నారు. రజాకార్ల ఫైల్స్ చూసిన తర్వాతనే ఆ సినిమాపై మాట్లాడాలన్నారు. బీజేపీ నేతలు జోకర్లు కాదని హీరోలన్నారు. బీఆరెస్, ఎంఐఎంలు కలిసి ఎన్నికల్లో అక్రమాల ద్వారా […]

Raja Singh
విధాత: తనతో కలిసి మంత్రి కేటీఆర్ రజాకార్స్ ఫైల్స్ సినిమా చూడటానికి రావాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి కేటీఆర్‌కు నిజాం పాలన చరిత్ర తెలియదన్నారు. తన తండ్రి కేసీఆర్‌ను అడిగి మీర్ ఉస్మాన్ అలిఖాన్ అరాచకాల గురించి కేటీఆర్ తెలుసుకోవాలన్నారు.
రజాకార్ల ఫైల్స్ చూసిన తర్వాతనే ఆ సినిమాపై మాట్లాడాలన్నారు. బీజేపీ నేతలు జోకర్లు కాదని హీరోలన్నారు. బీఆరెస్, ఎంఐఎంలు కలిసి ఎన్నికల్లో అక్రమాల ద్వారా గెలించేందుకు ఓక్కో నియోజకవర్గంలో 70వేల బోగస్ ఓట్ల కుట్రకు తెరలేపారని ఆరోపించారు.
దీంతో ఒక నియోజవర్గం ఓట్లు మరో నియోజకవర్గంలోకి వెలుతున్నాయన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల వ్యక్తుల ఓట్లు ఇక్కడ భారీగా ఉన్నాయన్నారు. గోషామహల్ నియోజవకర్గంలో ఒట్లు తగ్గుతున్నాయని, దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
