Red Wine | పోర్చ్‌గీస్ దేశంలోని ఓ చిన్న నగరం వీధుల్లో రెడ్ వైన్ పరవళ్లు తొక్కింది. ఘటన జరిగిన సావో లోరియెంకో డె బైరో అనే ఈ నగరం ఒక చిన్న కొండవాలు ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ ఉన్న వైన్ డిస్టిలరీ నుంచి చుట్టు పక్కల ప్రాంతాలకు వైన్ను సరఫరా చేస్తుంది. అందులో ఉన్న ఓ కంటైనర్‌కు సోమవారం భారీ లీక్ ఏర్పడింది. దీంతో సుమారు 6 లక్షల బ్యారెళ్ల రెడ్ వైన్ పరవళ్లు తొక్కుతూ […]

Red Wine |
పోర్చ్‌గీస్ దేశంలోని ఓ చిన్న నగరం వీధుల్లో రెడ్ వైన్ పరవళ్లు తొక్కింది. ఘటన జరిగిన సావో లోరియెంకో డె బైరో అనే ఈ నగరం ఒక చిన్న కొండవాలు ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ ఉన్న వైన్ డిస్టిలరీ నుంచి చుట్టు పక్కల ప్రాంతాలకు వైన్ను సరఫరా చేస్తుంది.
అందులో ఉన్న ఓ కంటైనర్‌కు సోమవారం భారీ లీక్ ఏర్పడింది. దీంతో సుమారు 6 లక్షల బ్యారెళ్ల రెడ్ వైన్ పరవళ్లు తొక్కుతూ నేలపై పారింది. డిస్టిలరీ బాగా ఎత్తైన ప్రదేశంలో ఉండటంతో వాలులో ఉన్న వీధుల్ని ముంచెత్తుతూ వైన్ ముందుకు సాగింది.
దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్‌లో వైరల్‌గా మారాయి. వైన్ నది ఉద్భవించిందని దీనిపై పలువురు యూజర్లు అభివర్ణించారు. చూడటానికి ఎంతో అందంగా ఉన్న ఈ దృశ్యం పర్యావరణ పరంగా తీవ్ర హాని కలిగించే ప్రమాదముంది. అందుకే ఘటన జరిగిన వెంటనే సిబ్బంది హుటాహుటిన దిద్దుబాటు చర్యలు ప్రారంభించారని స్థానిక మీడియా పేర్కొంది.
ఈ నగరం పక్కనే పారుతున్న సెర్టిమా నదిలోకి ఇంత మొత్తంలో రెడ్ వైన్ వెళితే జీవజాలానికి ముప్పు. ఆ నీరు తాగు, సాగు అవసరాలకు కూడా పనికిరాదు. దీంతో తొలుత సిబ్బంది లీక్‌ను అరికడదామని చూశారు. అది అసాధ్యం అని తేలడంతో కొండ వాలు కింద ఆ ప్రవాహం దారి మళ్లించి పంట పొలాల్లోకి ఆ వైన్ను పంపేశారు. దీంతో ఆ నగర వాసులు ఊపిరి పీల్చుకున్నారు.
