Rekha | ఆకాశ్ హీరోగా శ్రీను వైట్ల తెరకెక్కించిన చిత్రం ఆనందం. 2001లో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో కథానాయికగా రేఖ నటించింది. ఆనందం సినిమా ఆకాష్‌కి, ఇటు రేఖలకు పేర్లు రావడంతో పాటు దర్శకుడిగా శ్రీను వైట్లకి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించేలా చేసింది. అయితే ఆనందం చిత్రంతో ఒక్కసారిగా లైమ్ లైట్‌లోకి వచ్చిన రేఖ.. `జాబిలితో పాటు నందమూరి తారకరత్నతో `ఒకటో నెంబర్ కుర్రాడు`, […]

Rekha |
ఆకాశ్ హీరోగా శ్రీను వైట్ల తెరకెక్కించిన చిత్రం ఆనందం. 2001లో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో కథానాయికగా రేఖ నటించింది. ఆనందం సినిమా ఆకాష్‌కి, ఇటు రేఖలకు పేర్లు రావడంతో పాటు దర్శకుడిగా శ్రీను వైట్లకి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించేలా చేసింది.
అయితే ఆనందం చిత్రంతో ఒక్కసారిగా లైమ్ లైట్‌లోకి వచ్చిన రేఖ.. 'జాబిలితో పాటు నందమూరి తారకరత్నతో 'ఒకటో నెంబర్ కుర్రాడు', 'జానకి వెడ్స్ శ్రీరామ్'వంటి చిత్రాలలో మెరిసింది. అయితే ఈ అమ్మడికి తెలుగులో పలు అవకాశాలు వచ్చిన పెద్దగా సద్వినియోగ పరచుకోలేకపోయింది. కన్నడలో మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
2008లో 'నిన్న నేడు రేపు' రేఖ తెలుగులో చివరి చిత్రం కాగా, ఆ తర్వాత టాలీవుడ్‌లో కనిపించడమే మానేసింది. అయితే కొద్ది రోజుల క్రితం ఆలీ హోస్ట్ గా నిర్వహించిన 'అలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ చాలా లావుగా కనిపించి షాకిచ్చింది.
అప్పుడు అందరు ఈమె ఏంటి ఇంత లావు అయిందని అనుకున్నారు. ఇక కొన్నాళ్లపాటు మళ్లీ సైలెంట్‌గా ఉన్న ఆనందం హీరోయిన్ తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీలో మెరిసింది. ఈ సారి చాలా బక్క చిక్కి విచిత్రంగా దర్శనమిచ్చింది. అసలు రేఖని చూసిన వాళ్లు ఆమె ఏదైన అనారోగ్యంతో బాధపడుతుందా అని అందరు అనుకుంటున్నారు.
రేఖని చూసి శ్రీదేవి డ్రామా కంపెనీ కంటెస్టెంట్స్ కూడా ముందు షాక్ అయ్యారు. అయితే ఆమెలో ఎనర్జీ చూసి ఖుష్ అయ్యారు. బుల్లెట్ భాస్కర్‌పై పంచ్‌లేసి తెగ నవ్వులు పూయించింది రేఖ. అయితే ఇంద్రజ.. రేఖని ఇలా చూసి చాలా ఆనందంగా ఉందని చెప్పింది, కాకపోతే ఇలా చూడడం కాస్త ఆశ్చర్యానికి గురి చేసిందని పేర్కొంది. దీనికి రేఖ కూడా స్పందిస్తూ వివరణ ఇచ్చింది.
అయితే తను ఇలా మారిపోవడానికి గల పూర్తి కారణం ఏంటో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు వేచి చూడక తప్పదు. కాగా రేఖ ఈ ఏడాది ప్రారంభంలోనూ కూడా మంచిగానే ఉండేది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో గ్లామర్ ఫోటోలు పంచుంటూ అలరించింది. కాని సడెన్‌గా ఇలా మారడం వెనక కారణం ఏంటనేది త్వరలో తెలియనుంది.
