Tuesday, January 31, 2023
More
    Homeవార్త‌లుకృష్ణగారితో అక్రమ సంబంధం అంటగట్టాడు: నరేష్‌పై రమ్య సంచలన ఆరోపణలు

    కృష్ణగారితో అక్రమ సంబంధం అంటగట్టాడు: నరేష్‌పై రమ్య సంచలన ఆరోపణలు

    విధాత‌: సీనియర్ న‌టుడు నరేష్ ఇటీవల తాను నాలుగో వివాహం చేసుకోనున్నానని, తన సహనటి పవిత్ర లోకేష్‌తో కలిసి ఇప్పటికే స‌హ‌జీవనం చేస్తూ.. త్వరలో అధికారికంగా వివాహం చేసుకుంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

    ఈ సందర్భంగా నరేష్- పవిత్ర లోకేష్‌లు ముద్దు పెట్టుకుంటున్న ఫోటో కూడా విడుదల అయింది. ఈ కిస్సింగ్ వీడియో న్యూ ఇయర్ టైంలో ఓ రేంజ్‌లో ట్రెండ్ అయింది. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత నరేష్ మూడో భార్య, రఘువీరారెడ్డి సోదరుడి కుమార్తె రమ్య రఘుపతి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

    నరేష్ చాలా దుర్మార్గుడు. ఎంతో మందితో అక్రమ సంబంధాలు ఉండేవి. తప్పులన్నీ నరేష్ చేసి నాపై ఆరోపణలు చేశాడు. ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. దేవుడులాంటి కృష్ణ గారితో నాకు అక్రమ సంబంధం ఉందని నరేష్ ఆరోపించారు. ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలు ఇంకా నా వద్ద ఉన్నాయి.

    కానీ కృష్ణ గారి ఇంటి ప్రతిష్ట మర్యాదలను దృష్టిలో పెట్టుకొని ఇన్నాళ్లు ఈ నిజాన్ని చెప్పలేదు. కానీ రోజు రోజుకు నరేష్ దారుణాలు పెరిగిపోతున్నాయి. అందుకే నిజం చెప్పాల్సి వచ్చింది. నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని నరేష్ చేయని పనులు లేవు. చివరికి కృష్ణ గారి సంతకాన్ని ఫోర్జరీ చేసి నాకు ఇంజక్షన్స్ సూట్ పంపాడు.

    అందులో నా నుంచి కృష్ణ గారికి ప్రాణహాని ఉందని రాశారు. అంతకంటే దారుణం ఏంటంటే దేవుడి లాంటి తండ్రి స్థానంలో ఉన్న కృష్ణ గారికి, నాతో అక్రమ సంబంధం ఉందని సూట్‌లో చెప్పారు. ఇంతకంటే దారుణం ఏముంటుంది? ఇందుకు సంబంధించి పత్రాలపై కృష్ణ గారి సంతకాన్ని ఫోర్జరీ చేశారు.

    ఈ విషయాన్ని కృష్ణ గారి దృష్టికి తీసుకెళ్ళమని మా కుటుంబ సభ్యులు చాలామంది చెప్పారు. కానీ నరేష్ చేసే పనుల వల్ల ఆయన గౌరవం దెబ్బ తినకూడదని నేను కృష్ణ గారితో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇలాంటి దారుణాలు చేసి నా నుంచి విడాకులు తీసుకోవాలని నరేష్ ప్రయత్నాలు చేస్తున్నాడు.

    కానీ నేను విడాకులు ఇవ్వను. నా కుమారుడు నాన్న కావాలని అంటున్నాడని, విడాకుల కేసు ఇంకా పెండింగ్‌లోనే ఉంది. అన్నీ కోర్టులోనే తేల్చుకుంటానని రమ్య రఘుపతి కుండ బద్దలు కొట్టేసింది.

    ఇంకా పవిత్ర లోకేష్ నరేష్ గురించి కూడా రమ్య మాట్లాడుతూ పవిత్రను తొలిసారి నరేష్ తనకు పరిచయం చేసినప్పుడు ఇద్దరం కన్నడలో మాట్లాడుకున్నామని అంతే కాకుండా ఆమెకు తన చేత్తో అన్నం వడ్డించానని అన్నారు.

    కానీ చివరికి నరేష్- పవిత్రలు క‌లిసి తనకే ద్రోహం చేశారని రమ్య ఆరోపించారు. నా కుమారుడు నాన్న కావాలని కోరుకుంటున్నాడు. కనుక నరేష్‌ను వదిలే ప్రసక్తే లేదని, నరేష్-పవిత్రల పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో జరగనీయనని రమ్య రఘుపతి స్పష్టం చేశారు.

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular