మోక్షం క‌ల్పించిన సుప్రీం కోర్టు విధాత‌: మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీ హ‌త్య కేసులో జైలు శిక్ష అనుభ‌విస్తున్న న‌ళిని శ్రీ‌హ‌ర‌న్ తో పాటు మ‌రో ఐదుగురికి సుప్రీం కోర్టు మోక్షం ల‌భించింది. జైలు శిక్ష అనుభ‌విస్తున్న ఆరుగురిని విడుద‌ల చేయాలంటూ దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం తీర్పు నిచ్చింది. హ‌త్య కేసులో నిందితుల‌ను విడుద‌ల చేయాల‌ని అప్ప‌టి త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌కు 2018లో లేఖ రాసింది. 1991 మే 21న త‌మిళ‌నాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎన్నిక‌ల ప్ర‌చారానికి […]

మోక్షం క‌ల్పించిన సుప్రీం కోర్టు

విధాత‌: మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీ హ‌త్య కేసులో జైలు శిక్ష అనుభ‌విస్తున్న న‌ళిని శ్రీ‌హ‌ర‌న్ తో పాటు మ‌రో ఐదుగురికి సుప్రీం కోర్టు మోక్షం ల‌భించింది. జైలు శిక్ష అనుభ‌విస్తున్న ఆరుగురిని విడుద‌ల చేయాలంటూ దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం తీర్పు నిచ్చింది.

హ‌త్య కేసులో నిందితుల‌ను విడుద‌ల చేయాల‌ని అప్ప‌టి త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌కు 2018లో లేఖ రాసింది. 1991 మే 21న త‌మిళ‌నాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎన్నిక‌ల ప్ర‌చారానికి వ‌చ్చిన రాజీవ్‌గాంధీని ఆత్మాహుతి స‌భ్యులు హ‌త్య‌గావించారు. విచార‌ణ అనంత‌రం న్యాయ‌స్థానం ఏడుగురు నిందితుల‌కు మ‌ర‌ణ‌శిక్ష విధించింది.

తదనంతరం కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీకి ఉరిశిక్ష ర‌ద్దు చేయాల‌ని సిఫార‌సు చేయ‌డంతో న‌ళినికి ఉరిశిక్ష ర‌ద్దు చేసి యావ‌జ్జీవ శిక్ష‌గా మార్చారు. సోనియా త‌న‌య ప్రియాంక వాద్రా 2008లో వెల్లూరు జైలులో న‌ళినినీ క‌లిశారు. 2014లో మ‌రో ఆరుగురు నిందితుల‌కు మ‌ర‌ణ‌శిక్ష త‌ప్పించి యావ‌జ్జీవ శిక్ష‌గా మార్చారు.

అదే సంవ‌త్స‌రం అప్ప‌టి త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి కుమారి జ‌య‌ల‌లిత వీరిని విడుద‌ల చేయాల‌ని కోరింది. ఈ నిర్ణ‌యంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. సుప్రీం కోర్టు తీర్పుపై న‌ళిని సొద‌రుడు బ‌కినాథ‌న్ మాట్లాడుతూ నిందితులు ఇప్ప‌టికే 33 సంవ‌త్స‌రాలు జైలు శిక్ష అనుభ‌వించార‌ని, ఎంతో క్షోభ‌ను అనుభ‌వించార‌ని తెలిపారు. మాన‌వ‌త్వంలో వారిని విడుద‌ల చూస్తూ తీర్పు ఇచ్చార‌ని, దీనిని వ్య‌తిరేకించే వారు సుప్రీం కోర్టు తీర్పును గౌర‌వించాల‌ని ఆయ‌న కోరారు.

Updated On 11 Nov 2022 11:20 AM GMT
krs

krs

Next Story