MLA Bandla | హైకోర్టు అనర్హత వేటు తీర్పుపై స్టే విధాత : అనర్హత వేటును ఎదుర్కోంటున్న గద్వాల బీఆరెస్ ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట దక్కింది. తప్పుడు ఎన్నికల అఫిడవిట్ కేసులో హైకోర్టు బండ్ల ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు వేస్తూ, డీకె. అరుణను ఎమ్మెల్యేగా గురిస్తూ తీర్పునిచ్చింది. ఈ మేరకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం కూడా నోటిఫికేషన్ జారీ చేసింది. అసెంబ్లీ కార్యదర్శి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు […]

MLA Bandla |
- హైకోర్టు అనర్హత వేటు తీర్పుపై స్టే
విధాత : అనర్హత వేటును ఎదుర్కోంటున్న గద్వాల బీఆరెస్ ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట దక్కింది. తప్పుడు ఎన్నికల అఫిడవిట్ కేసులో హైకోర్టు బండ్ల ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు వేస్తూ, డీకె. అరుణను ఎమ్మెల్యేగా గురిస్తూ తీర్పునిచ్చింది.
ఈ మేరకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం కూడా నోటిఫికేషన్ జారీ చేసింది. అసెంబ్లీ కార్యదర్శి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గెజిట్ లో ఎమ్మెల్యేగా అరుణను పేర్కోన్నారు. దీనిని సవాల్ చేస్తూ బండ్ల సుప్రీం కోర్టును ఆశ్రయించగా, హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఎన్నికల సంఘానికి, ప్రతివాదులకు రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని నోటీస్ లు జారీ చేసింది.
ఈ కేసులో తన వాదనలు కూడా వినాలని అరుణ సుప్రీం కోర్టులో కేవియట్ దాఖలు చేసింది. కృష్ణ మోహన్ రెడ్డి తరుపు లాయర్ సుందరం సుప్రీం కోర్టులో తన వాదనల సందర్భంగా తన క్లయింట్ బ్యాంకు ఖాతాల వివరాలను వెల్లడించకపోవడం తప్పేనని అంగీకరించారు. ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీం కోర్టు కేసు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
