విధాత: 3 ఈడియట్స్ (3idiots) సినిమా గుర్తుందా? ఆమిర్‌ఖాన్, కరీనాకపూర్, మాధవన్, శర్మన్ జోషి నటించిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రతి సీన్ అద్భుతంగా ఉంటుంది. డైలాగ్స్ సరేసరి. వాటితో ఎన్ని మీమ్స్ వచ్చాయో లెక్కే లేదు. చేతన్ భగత్ రాసిన 5 పాయింట్ సమ్‌వన్ నవల ఆధారంగా ఈ సినిమా తీశారు.
ఈ సినిమాలో స్కూటర్‌పై హాస్పిటల్‌కు వెళ్లే సన్నివేశం కూడా గుర్తుండే ఉంటుంది. రాజు రస్తోగీ (శర్మన్ జోషి) తండ్రికి ఆరోగ్యం బాగోలేక పోతే ర్యాంచో (ఆమిర్‌ఖాన్) స్కూటర్‌పైనే తీసుకుని నేరుగా ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకొచ్చి స్కూటర్‌ను ఆపుతాడు. ఇలాంటి దృశ్యాలు సినిమాల్లోనే కనిపిస్తుంటాయనుకుంటే పొరపాటే. నిజ జీవితంలోనూ అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి.
View this post on Instagram
అందుకు నిదర్శనమే ఈ వీడియో. ఇద్దరు వ్యక్తులు ఒక వృద్ధుడిని స్కూటర్ మధ్యలో కూర్చొనబెట్టుకుని వెళుతున్న దృశ్యాన్ని దారిన పోయేవారు రికార్డు చేశారు. దీనిని చూసిన నెటిజన్లు 3 ఈడియట్స్ సినిమా గుర్తొస్తున్నదని వ్యాఖ్యానించారు. కొందరైతే అది ప్రమాదకరమని కామెంట్ పెట్టారు.