విధాత: విదేశాల్లో ఉన్న వారు, ఇతర ప్రంతాల్లో ఉన్నవారి సౌలభ్యం కోసం భారత ఎన్నికల కమిషన్ (ఈసి) తీసుకువచ్చిన రిమోట్ ఓటింగ్ విధానానికి తెలుగుదేశం పార్టీ (TDP) జై కొట్టింది. కాగా కాంగ్రెస్‌తో పాటు మెజారిటీ పార్టీలు ఈ విధానాన్ని వ్యతిరేకించాయి. కాగా BRS పార్టీ గైర్హాజరైంది. రిమోట్ ఓటింగ్ మిషన్ (ఆర్.వి.ఎం)పై ఇవాళ ప్రధాన పార్టీలతో భారత ఎన్నికల కమిషన్ సమావేశం నిర్వహించింది. రిమోట్ ఓటింగ్ మిషన్ తో ఎక్కడి నుంచైనా తమ ఓటు హక్కును […]

విధాత: విదేశాల్లో ఉన్న వారు, ఇతర ప్రంతాల్లో ఉన్నవారి సౌలభ్యం కోసం భారత ఎన్నికల కమిషన్ (ఈసి) తీసుకువచ్చిన రిమోట్ ఓటింగ్ విధానానికి తెలుగుదేశం పార్టీ (TDP) జై కొట్టింది. కాగా కాంగ్రెస్‌తో పాటు మెజారిటీ పార్టీలు ఈ విధానాన్ని వ్యతిరేకించాయి. కాగా BRS పార్టీ గైర్హాజరైంది.

రిమోట్ ఓటింగ్ మిషన్ (ఆర్.వి.ఎం)పై ఇవాళ ప్రధాన పార్టీలతో భారత ఎన్నికల కమిషన్ సమావేశం నిర్వహించింది. రిమోట్ ఓటింగ్ మిషన్ తో ఎక్కడి నుంచైనా తమ ఓటు హక్కును వినియోగించుకోచ్చు. వలస ఓటర్లకు ప్రయోజనం కలిగేలా ఈ విధానాన్ని తీసుకువచ్చారు.

ఇంటి నుంచి దూరంగా ఉండే ఓటర్లు, వలస కూలీలు ఓట్లు వేసుకోవచ్చు. ఈ సమావేశానికి 8 గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు, 57 ప్రంతీయ పార్టీలను పిలిచారు. బీఆర్ఎస్ గైర్హాజరు కాగా మిగతా పార్టీలు హాజరై తమ అభిప్రయం సుస్పష్టం చేశాయి.

కాంగ్రస్‌తో పాటు 16 ప్రతిపక్ష పార్టీలు ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. కాంగ్రెస్‌తో పాటు నేషనల్ కాన్ఫరెన్స్, ఎస్పీ, ఎన్సీపీ, సీపీ, జేడీయూ, శివసేన ఉద్ధవ్ వర్గం, జేఎంఎం, ఆర్జేడీ, వీసీకే, ఆర్.యు.ఎం.ఎల్, ఆర్.వి.ఎం, ఆర్.ఎస్.పి, పీడీపీలు ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి.

Updated On 16 Jan 2023 1:08 PM GMT
krs

krs

Next Story