ఎక్కడి నుంచైనా ఓటేయొచ్చు.. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్
Remote EVM | ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఇక నుంచి వలసొచ్చిన ప్రజలు తమ సొంతూర్లకు వెళ్లకుండాను ఓటు వేసేందుకు రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ నమూనాను రూపొందించింది ఈసీ. ఈ మిషన్ నమూనాను జనవరి 16వ తేదీన రాజకీయ పార్టీలకు ఈసీ ప్రదర్శించనున్నది. ఈ మేరకు దేశంలో గుర్తింపు పొందిన అన్ని పార్టీలకు ఈసీ లేఖలు రాసింది. రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వినియోగంలో ఎదురయ్యే […]

Remote EVM | ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఇక నుంచి వలసొచ్చిన ప్రజలు తమ సొంతూర్లకు వెళ్లకుండాను ఓటు వేసేందుకు రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ నమూనాను రూపొందించింది ఈసీ. ఈ మిషన్ నమూనాను జనవరి 16వ తేదీన రాజకీయ పార్టీలకు ఈసీ ప్రదర్శించనున్నది. ఈ మేరకు దేశంలో గుర్తింపు పొందిన అన్ని పార్టీలకు ఈసీ లేఖలు రాసింది. రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వినియోగంలో ఎదురయ్యే న్యాయ, నిర్వాహక, సాంకేతిక సవాళ్లు, సమస్యలపై తమ అభిప్రాయాలను జనవరి 31లోపు తెలియజేయాలని పార్టీలను ఈసీ కోరింది. ఈ బహుళ నియోజకవర్గాల రిమోట్ ఓటింగ్ మిషన్ ద్వారా ఒకే పోలింగ్ బూత్ నుంచి 72 నియోజకవర్గాల ఓటర్లు వారి సొంత నియోజకవర్గాల్లో ఓట్లు వేయవచ్చని ఎన్నికల కమిషన్ వెల్లడించింది.
ఈసీ ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జైరాం రమేశ్ స్పందించారు. ఎన్నికల వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని ఇది దెబ్బతీస్తుందని ఆరోపించారు. ముందుగా ఈవీఎంల దుర్వినియోగం మీద ప్రతిపక్షాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అదే విధంగా ఎన్నికల వ్యవస్థపై నమ్మకాన్ని కల్పించాలని ఈసీని కోరారు.
అయితే ఎన్నికలు రాగానే పట్టణాలకు చాలా మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు గ్రామాల బాట పడుతారు. ఉపాధి కోసం వలసొచ్చిన కూలీలు మాత్రం ఎన్నికలు వచ్చినప్పటికీ, సొంతూర్లకు వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపారు. ఈ క్రమంలో ఓటింగ్ శాతం పూర్తిగా తగ్గిపోతోంది. 2019 సాధారణ ఎన్నికల్లో 67.4 శాతమే పోలింగ్ నమోదైంది. దాదాపు 30 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ప్రతిపాదనను ఈసీ ముందుకు తీసుకొచ్చింది.
