విధాత‌, హైదరాబాద్: బంజారాహిల్స్‌ డీఏవీ పాఠశాల గుర్తింపును రాష్ట్ర విద్యాశాఖ పునరుద్ధరించింది. పాఠశాలలో చిన్నారిపై లైంగిక దాడి నేపథ్యంలో గుర్తింపును రద్దు చేసిన విషయం తెలిసిందే. విద్యార్థుల భవిష్యత్‌ దృష్ట్యా పాఠశాలను కొనసాగించాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరారు. అయితే.. తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈ విద్యా సంవత్సరానికి తాత్కాలిక అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. విద్యాశాఖ సూచించిన నిబంధనలు అమలు చేయాలని పాఠశాల యాజమాన్యాన్ని విద్యా శాఖ ఆదేశించింది. అనుమతి లభించడంతో గురువారం పాఠశాలను పునఃప్రారంభించనున్నట్లు […]

విధాత‌, హైదరాబాద్: బంజారాహిల్స్‌ డీఏవీ పాఠశాల గుర్తింపును రాష్ట్ర విద్యాశాఖ పునరుద్ధరించింది. పాఠశాలలో చిన్నారిపై లైంగిక దాడి నేపథ్యంలో గుర్తింపును రద్దు చేసిన విషయం తెలిసిందే. విద్యార్థుల భవిష్యత్‌ దృష్ట్యా పాఠశాలను కొనసాగించాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరారు.

అయితే.. తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈ విద్యా సంవత్సరానికి తాత్కాలిక అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. విద్యాశాఖ సూచించిన నిబంధనలు అమలు చేయాలని పాఠశాల యాజమాన్యాన్ని విద్యా శాఖ ఆదేశించింది. అనుమతి లభించడంతో గురువారం పాఠశాలను పునఃప్రారంభించనున్నట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది.

Updated On 1 Nov 2022 12:04 PM GMT
Somu

Somu

Next Story