HomelatestMusic Director Raj | ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్‌ కన్నుమూత

Music Director Raj | ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్‌ కన్నుమూత

Music Director Raj

విధాత‌: ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్‌ కన్నుమూశారు. గుండెపోటుతో కూకట్‌పల్లిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. రాజ్‌ అసలు పేరు తోటకూర సోమరాజు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సంగీత ప్రపంచంలో రాజ్‌-కోటి ద్వయం ప్రఖ్యాతిగాంచింది.

దశాబ్దాల పాటు ఈ ద్వయం సినీ ప్రియులను తమ సంగీతంతో అలరించింది. కోటి నుంచి విడిపోయాక రాజ్‌ కొన్ని సినిమాలకు సంగీతం అందించారు.

2011 తర్వాత రాజ్‌-కోటి మళ్లీ కలిసి పనిచేశారు. హలో బ్రదర్‌ చిత్రానికి నంది అవార్డు అందుకున్నారు. హలోబ్రదర్‌, గోవిందా గోవిందా, ముఠామేస్త్రీ వంటి విజ‌యవంతమైన సినిమాలకు సంగీతం అందించారు.

180 చిత్రాలకు పైగా రాజ్‌-కోటి ద్వయం సంగీతం అందించింది. 3 వేల కు పైగా పాటలకు రాజ్‌-కోటి స్వరకల్పన చేశారు. ప్రళయ గర్జన సినిమాతో రాజ్‌-కోటి సంగీత ప్రస్థానం మొదలుపెట్టారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular