విధాత: అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్ట‌ర్ ఖాతా పున‌రుద్ధ‌రించ‌బ‌డింది. ఈ నేప‌థ్యంలో నిమిష నిమిషానికి ట్రంప్‌కు ఫాలోవ‌ర్ల సంఖ్య పెరుగుతోంది. అయితే 2021, జ‌న‌వ‌రిలో చోటు చేసుకున్న క్యాపిట‌ల్ హిల్ దాడి త‌ర్వాత ట్రంప్ ట్విట్ట‌ర్ ఖాతాను మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ నిషేధించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ట్విట్ట‌ర్ అధినేత ఎలాన్ మ‌స్క్.. ట్రంప్ ట్విట్ట‌ర్ ఖాతాపై ఓటింగ్ నిర్వ‌హించిన విష‌యం విదిత‌మే. ఈ ఓటింగ్‌లో ట్రంప్‌కు అనుకూలంగా 51.8 […]

విధాత: అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్ట‌ర్ ఖాతా పున‌రుద్ధ‌రించ‌బ‌డింది. ఈ నేప‌థ్యంలో నిమిష నిమిషానికి ట్రంప్‌కు ఫాలోవ‌ర్ల సంఖ్య పెరుగుతోంది. అయితే 2021, జ‌న‌వ‌రిలో చోటు చేసుకున్న క్యాపిట‌ల్ హిల్ దాడి త‌ర్వాత ట్రంప్ ట్విట్ట‌ర్ ఖాతాను మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ నిషేధించిన సంగ‌తి తెలిసిందే.

ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ట్విట్ట‌ర్ అధినేత ఎలాన్ మ‌స్క్.. ట్రంప్ ట్విట్ట‌ర్ ఖాతాపై ఓటింగ్ నిర్వ‌హించిన విష‌యం విదిత‌మే. ఈ ఓటింగ్‌లో ట్రంప్‌కు అనుకూలంగా 51.8 శాతం మంది ఓటేశారు. ఈ క్ర‌మంలో ట్రంప్ ఖాతాను పున‌రుద్ధ‌రిస్తున్న‌ట్లు మ‌స్క్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు. దీంతో 22 నెల‌ల త‌ర్వాత ట్రంప్ ట్విట్ట‌ర్ అకౌంట్ మ‌ళ్లీ ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇంకేముంది ఆయ‌న‌క ఫాలోవ‌ర్లు పెరిగి పోతూనే ఉన్నారు.

డోనాల్డ్ ట్రంప్‌కు తిరిగి ట్విట్టర్ ఖాతాను ఇద్దామా? వ‌ద్దా? అని ఎలాన్‌ మస్క్‌ పోల్ నిర్వహించారు. ఎస్ ఆర్ నో చెప్పాలంటూ శనివారం ఆయ‌న ఓ ట్వీట్ చేశారు. 24 గంటలపాటు కొనసాగిన ఈ పోల్‌లో కోటీ 50 లక్షల 85వేల 458 మంది పాల్గొన్నారు. అందులో 51.8 శాతం మంది ట్రంప్‌కు అనుకూలంగా, 48.2 శాతం మంది వ్యతిరేకంగా స్పందించారు. దీంతో 22 నెలల నిషేధం తర్వాత ట్రంప్‌ ట్విట్టర్‌ ఖాతాను సంస్థ పునరుద్ధరించింది.

Updated On 20 Nov 2022 9:11 AM GMT
krs

krs

Next Story