Wednesday, March 29, 2023
More
  Homelatestదమ్ముంటే రా బిడ్డా.. పరిగెత్తించకుంటే గుండు కొట్టించుకుంటా: ఎమ్మెల్యే గండ్రకు రేవంత్ హెచ్చరిక

  దమ్ముంటే రా బిడ్డా.. పరిగెత్తించకుంటే గుండు కొట్టించుకుంటా: ఎమ్మెల్యే గండ్రకు రేవంత్ హెచ్చరిక

  • ఉద్రిక్తత నడుమ పాదయాత్ర
  • సభలో BRS కార్యకర్తల గొడవ
  • రాళ్ళు, కోడిగుడ్లు, టమాటాలతో కాంగ్రెస్‌ కార్యకర్తలపై దాడి

  విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: దమ్ముంటే నువ్వు రా బిడ్డా చూసుకుందాం.. నిన్ను పరిగెత్తించ కుంటే భూపాల్ పల్లి అంబేద్కర్ సెంటర్ సాక్షిగా నేను గుండు కొట్టించుకుంటా అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర ఆవేశంతో స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డిని హెచ్చరించారు. మేం తలుచుకుంటే నీ థియేటర్, నీ ఇల్లు కూడా ఉండదు బిడ్డా.. తాగుబోతులను తీసుకొచ్చి మా సభపై దాడి చేపిస్తావా? అంటూ మండి పడ్డారు. పోలీసుల అండ చూసి ఉదయం మా కార్యకర్తలపై కొందరు సన్నాసులు దాడి చేశారంట, దమ్ముంటే నువ్వు రా బిడ్డా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పిలుపు మేరకు భూపాలపల్లిలో రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర మంగళవారం ఉదయం ఉద్రిక్తత నడుమ ప్రారంభమై రాత్రి ఉద్రిక్త పరిస్థితుల మధ్యనే ముగిసింది.

  సాయంత్రం భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్లో జరిగిన కార్నర్ మీటింగ్లో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. దోపిడీ దొంగలు, కొందరు సన్నాసులు, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి దొరల దొడ్డిలో గడ్డి తింటున్నారని రమణారెడ్డిని ఉద్దేశించి విమర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తల భుజాలు కాయగాసే విధంగా పనిచేసి గెలిపిస్తే దొరలదొడ్డిలో గడ్డి తింటున్నారని మండిపడ్డారు. ఉదయం పోలీసుల అండతో కాంగ్రెస్ కార్యకర్తలపై టిఆర్ఎస్ దాడి చేసిందని మండిపడ్డారు.

  ఎంగిలి సీసాలు, కల్లుమాములాలకు అమ్ముడు పోయే బాపతు కాంగ్రెస్ కార్యకర్తలు కాదని గుర్తు చేశారు. టమాటాలు, గుడ్లు విసిరినంత మాత్రాన భయపడతాం అనుకుంటున్నావా? దమ్ముంటే నువ్వు రా అంటూ విరుచుకపడ్డారు. ఓ ఎస్పీ ఎమ్మెల్యే నీకు చుట్టమైతే కావచ్చు కానీ గుడ్డలు ఊసిపోతాయి గుర్తుంచుకో అంటూ హెచ్చరించారు. అధికారం శాశ్వతం కాదు, దాడులు చేస్తుంటే పోలీసుల అండగా నిలుస్తున్నారని ఇదేనా నీ డ్యూటీ అంటూ ప్రశ్నించారు.

   కాంగ్రెస్ కు ఈసారి అవకాశం ఇవ్వండి

  తెలంగాణ తెచ్చిన మని చెప్పినందుకే కెసిఆర్ కు రెండు సార్లు అవకాశం ఇచ్చారని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటూ రేవంత్ విన్నవించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదల ఇల్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షలు, రైతులకు రెండు లక్షల రుణమాఫీ, రూ.5లక్షల ఆరోగ్య శ్రీ సదుపాయం, గ్యాస్ సిలిండర్ రూ. 500 కే ఇస్తామని హామీ ఇచ్చారు. మరోసారి కెసిఆర్ చేతిలో మోసపోయేందుకు ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు.

  వచ్చే ఎన్నికల్లో భూపాల్ పల్లి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందని రేవంత్ రెడ్డి భరోసా వ్యక్తం చేశారు. ఈ కార్నర్ మీటింగ్లో ఏఐసీసీ కార్యదర్శి మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఇసుక మాఫియా పెరిగిపోయిందని, పోలీసులు చూస్తూ ఉంటే అడ్వకేట్లను హత్య చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి, భూపాల్ పల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ గండ్ర సత్యనారాయణరావు, సిరిసిల్ల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

  ఉద్రిక్తత మధ్య రేవంత్ పర్యటన

  ఉదయం నియోజకవర్గంలో చేపట్టిన పాదయాత్ర సందర్భంగా విద్యార్థులు, రైతులు, సింగరేణి కార్మికులతో కలిసి వారి సమస్యలను రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు. ఇది ఇలా ఉండగా రేవంత్ రెడ్డి పర్యటన మొత్తం ఉద్రిక్తత మధ్య సాగింది. ఉదయం ఫ్లెక్సీల కట్టే సమయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉండగా పాదయాత్ర, సభకు భారీ స్థాయిలో జనం హాజరయ్యారు.

  spot_img
  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular