విధాత: 15 వారాలుగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ సీజన్ -6 లో సింగర్ రేవంత్ టైటిల్ విన్నర్ గా, రన్నర్ గా శ్రీ హాన్ నిలిచారు. ఓటింగ్ పరంగా శ్రీహాన్ కే ఎక్కువ ఓట్లు వచ్చాయి. అయితే బిగ్ బాస్ ఇచ్చిన రూ.40 లక్షల ఆఫర్ ను శ్రీహాన్ అంగీకరించాడు. దీంతో నాగార్జున రేవంత్ ను విజేతగా ప్రకటించారు. ఈ టైటిల్ కోసం మొత్తం […]

విధాత: 15 వారాలుగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ సీజన్ -6 లో సింగర్ రేవంత్ టైటిల్ విన్నర్ గా, రన్నర్ గా శ్రీ హాన్ నిలిచారు.

ఓటింగ్ పరంగా శ్రీహాన్ కే ఎక్కువ ఓట్లు వచ్చాయి. అయితే బిగ్ బాస్ ఇచ్చిన రూ.40 లక్షల ఆఫర్ ను శ్రీహాన్ అంగీకరించాడు. దీంతో నాగార్జున రేవంత్ ను విజేతగా ప్రకటించారు. ఈ టైటిల్ కోసం మొత్తం 21 మంది కంటెస్టెంట్లు పోటీ పడ్డారు.

ఉత్కంఠగా సాగిన గ్రాండ్ ఫినాలె లో మొదట రోహిత్, తర్వాత ఆదిరెడ్డి, బుల్లి తెర సీరియల్ నటీ కీర్తి భాటియా హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బైటికి వచ్చారు. చివరికి టైటిల్ పోరు కోసం రేవంత్, శ్రీహాన్ పోటీ పడ్డారు. బిగ్ బాస్ ఇచ్చిన గోల్డెన్ బాక్స్ శ్రీహాన్ తీసుకోవడంతో టైటిల్ రేవంత్ ను వరించింది.

Updated On 19 Dec 2022 5:51 AM GMT
krs

krs

Next Story