Revanth Reddy | అయ్యప్ప, శివ మాలధారణలా కాంగ్రెస్ దీక్ష సోనియమ్మ మాల వేసుకుని కష్టపడాలి పార్టీ శ్రేణులకు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి పిలుపు విధాత, హైదరాబాద్: వ‌చ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయాలని కాంగ్రెస్ శ్రేణుల‌కు టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. అయ్యప్ప, శివ మాలధారణలా కాంగ్రెస్ దీక్ష తీసుకుని, సోనియమ్మ మాల వేసుకుని కష్టపడాలని దిశానిర్దేశం చేశారు. బాగ్‌లింగంపల్లి ఆర్టీసీ కల్యాణ మండపంలో టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వ‌హించిన‌ జిల్లా, మండల, […]

Revanth Reddy |

  • అయ్యప్ప, శివ మాలధారణలా కాంగ్రెస్ దీక్ష
  • సోనియమ్మ మాల వేసుకుని కష్టపడాలి
  • పార్టీ శ్రేణులకు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి పిలుపు

విధాత, హైదరాబాద్: వ‌చ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయాలని కాంగ్రెస్ శ్రేణుల‌కు టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. అయ్యప్ప, శివ మాలధారణలా కాంగ్రెస్ దీక్ష తీసుకుని, సోనియమ్మ మాల వేసుకుని కష్టపడాలని దిశానిర్దేశం చేశారు. బాగ్‌లింగంపల్లి ఆర్టీసీ కల్యాణ మండపంలో టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వ‌హించిన‌ జిల్లా, మండల, బ్లాక్ అధ్యక్షులకు శిక్షణ కార్యక్రమంలో ఆయ‌న మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు బీజేపీ, బీఆరెస్ కలిసి కుట్రలు చేసున్నాయన్నారు.

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలంటే క్షేత్రస్థాయిలో బూత్ లెవల్ ఏజెంట్‌ల నియామకం జరగాలన్నారు. ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించేది బూత్ లెవెల్ ఏజెంట్లేన‌ని రేవంత్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ జెండాను మోసే నిఖార్సైన కార్యకర్తలను బూత్ లెవెల్ ఏజెంట్లుగా నియమించుకుందామ‌ని స్ప‌ష్టం చేశారు.

90లక్షల ఓట్లు తెచ్చుకుంటే రాష్ట్రంలో 90 సీట్లు గెలుస్తామ‌ని కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో 43 లక్షల డిజిటల్ మెంబర్షిప్ చేసుకున్నామ‌ని తెలిపారు. వంద రోజులు కాంగ్రెస్ పార్టీ కోసం, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కేటాయించండని వెల్ల‌డించారు.

ప్ర‌భుత్వం కుట్ర చేసినా రైతులు భూమి ఇచ్చారు

కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నారని, రజాకర్లు కూడా ఇంత దోపిడీ, విధ్వసానికి పాల్పడలేదని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో సీడబ్ల్యూసీ సమావేశాలు జరగడం ఈ గడ్డకు దక్కిన గౌరవమ‌ని, ఇక్కడ సమావేశాలు జరగడం వ‌ల్ల‌ పీసీసీ అధ్యక్షుడిగా నా జన్మ ధన్యమైంద‌న్నారు. వక్ఫ్ భూమిలో నాంపల్లి విజయ నగర్ కాలనీలో ఎంఐఎంకు అనుమతి ఇచ్చిన ప్ర‌భుత్వం మ‌రి తుక్కుగూడలో కాంగ్రెస్ సభకు ఎందుకు ఇవ్వదని ప్ర‌శ్నించారు.

దేవుడి భూమి అనే సాకుతో అనుమతి నిరాకరించినా ఆ దేవుడే మనకు దారి చూపారన్నారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విజయభేరి సభ కోసం వంద ఎకరాలు ఇచ్చారని తెలిపారు. ధర్మమే కాంగ్రెస్‌ను గెలిపిస్తుంది, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేన‌ని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ సెకటరీలు, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, సీనియర్ నాయకులు హాజరయ్యారు.

Updated On 10 Sep 2023 6:42 AM GMT
somu

somu

Next Story