Revanth Reddy | ఉచిత ఎరువులని ఊదరగొట్టారు గాలికి కొట్టుకుపోయిన హామీ ఆరు నూరు అవుతోంది కానీ కేసీఆర్ మాట మీద నిలవడు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి విమర్శ విధాత, హైదరాబాద్: ఆరు నూరు అవుతుందేమో కానీ సీఎం కేసీఆర్ మాట మీద నిలబడరని మరో సారి నిరూపితమైందని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఉచిత ఎరువులు అని రెైతుల చెవిలో మీరు పెట్టిన గులాబీ పూలు అలాగే ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి […]

Revanth Reddy |
- ఉచిత ఎరువులని ఊదరగొట్టారు
- గాలికి కొట్టుకుపోయిన హామీ
- ఆరు నూరు అవుతోంది కానీ
- కేసీఆర్ మాట మీద నిలవడు
- పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి విమర్శ
విధాత, హైదరాబాద్: ఆరు నూరు అవుతుందేమో కానీ సీఎం కేసీఆర్ మాట మీద నిలబడరని మరో సారి నిరూపితమైందని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఉచిత ఎరువులు అని రెైతుల చెవిలో మీరు పెట్టిన గులాబీ పూలు అలాగే ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణలో రైతులు వాడే ఎరువులను వందకు వంద శాతం ఉచితంగా సరఫరా చేస్తామని 2017 ఏప్రిల్ 13న ప్రగతి భవన్ సాక్షిగా మీరు రైతులకు ఇచ్చిన మాట, అన్ని హామీల మాదిరిగానే దిక్కు లేకుండా పోయిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాసిన బహిరంగలేఖలో రేవంత్‌రెడ్డి విమర్శించారు.
రాష్ట్రంలో ఎరువులు దొరక్క రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా ఉందన్నారు. ఒక్కో రైతుకు 20 నుంచి 30 బస్తాలు అవసరం ఉండగా, కేవలం ఒకటి నుంచి ఐదు బస్తాలు మాత్రమే ఇస్తుండటంతో రైతులు లబోదిబో మంటున్నారని రేవంత్ పేర్కొన్నారు. సరైన సమయంలో పంటలకు యూరియా వేయకపోతే పంట దిగుబడి తగ్గిపోతుందని ఆందోళన చెందుతున్నా పట్టించుకునే స్థితిలో మంత్రులు, ఎమ్మెల్యేలు లేరు. బాధ్యత వహించాల్సిన వ్యవసాయ మంత్రి పత్తా లేకుండా పోయిండని విమర్శించారు.
ప్రస్తుత డిమాండ్‌కు అనుగుణంగా కనీసం 2 లక్షల టన్నుల అవసరం ఉండగా ఇప్పుడు లక్షా 10 టన్నులే బఫర్ స్టాక్ మాత్రమే ఉందని చెప్పారు. ఇప్పటికైనా తక్షణమే అధికారులను అదేశించి యూరియా సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే రాష్ట్రంలోని రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉద్యమ కార్యాచరణకు దిగుతుందని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు
