Revanth Reddy హోంగార్డ్ రవీందర్ మృతిపై రేవంత్‌రెడ్డి కనీవినీ ఎరుగని రీతిలో విజయభేరి తుక్కగూడలో నిర్వహించే అవకాశం పరేడ్‌గ్రౌండ్స్ ఇవ్వకుండా కుట్రలు సీఎం కేసీఆర్‌వి చిల్లర ప్రయత్నాలు ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్య Revanth Reddy | విధాత, హైదరాబాద్: హోంగార్డ్ రవీందర్‌రెడ్డిది ఆత్మహత్య కాదని, అది రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చేసిన హత్య అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్ పై హత్యా నేరం కింద క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. హోంగార్డులకు […]

Revanth Reddy
- హోంగార్డ్ రవీందర్ మృతిపై రేవంత్‌రెడ్డి
- కనీవినీ ఎరుగని రీతిలో విజయభేరి
- తుక్కగూడలో నిర్వహించే అవకాశం
- పరేడ్‌గ్రౌండ్స్ ఇవ్వకుండా కుట్రలు
- సీఎం కేసీఆర్‌వి చిల్లర ప్రయత్నాలు
- ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్య
Revanth Reddy | విధాత, హైదరాబాద్: హోంగార్డ్ రవీందర్‌రెడ్డిది ఆత్మహత్య కాదని, అది రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చేసిన హత్య అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్ పై హత్యా నేరం కింద క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. హోంగార్డులకు 5 నెలలుగా జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని, దాని మూలంగానే రవీందర్ ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు.
🔥హోం గార్డు రవీందర్ చావుకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం.
చావు తర్వాత కూడా నిర్లక్ష్యమేనా!?
బాధ్యులైన అధికారుల పై చర్యలు లేవు.
పాలకుల నుండి కనీస పరామర్శలు లేవు.
దిక్కులేని ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం లేదు.ఈ నిర్లక్ష్యపు సర్కారుకు హోంగార్డుల తడాఖా చూపాల్సిందే.… pic.twitter.com/SdmOOvI978
— Revanth Reddy (@revanth_anumula) September 8, 2023
ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తెచ్చామన్నారు. 16, 17, 18 తేదీలలో జరగబోయే సీడబ్ల్యూసీ సమావేశాలు, బహిరంగ సభకు సంబంధించి భద్రత అంశాలపై రాష్ట్ర డీజీపీని ఆయన కార్యాలయంలో శుక్రవారం రేవంత్‌రెడ్డితో పాటు పార్టీ సీనియర్ నాయకులు కలిసి చర్చించారు.
జాతీయ నాయకుల రాక నేపథ్యంలో భద్రత కల్పించాలని వినతిపత్రం సమర్పించారు. అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రవీందర్ పిల్లల చదువుల ఖర్చు ప్రభుత్వమే భరించాలన్నారు. అలాగే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, 25లక్షల పరిహారం ఇవ్వాలని డీజీపీని కోరామని రేవంత్ తెలిపారు.
కనీవినీ ఎరుగని రీతిలో విజయభేరి
రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని రేవంత్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రం దివాలా తీయడానికి కేసీఆర్ అవినీతే కారణమని ఆరోపించారు. 16, 17న తాజ్ కృష్ణలో సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతాయని చెప్పారు. 17న విజయ భేరి బహిరంగ సభను నిర్వహిస్తున్నామని, ఇందుకు సంబంధించి భద్రతను అందించాలని డీజీపీని కోరినట్లు రేవంత్ పేర్కొన్నారు. పరేడ్ గ్రౌండ్స్ ఇవ్వకుండా బీజేపీ, బీఆరెస్ కుట్ర చేశాయని విమర్శించారు.
డీజీపీని కలిసి రెండు అంశాలను చర్చించాం.
🔥హోంగార్డు రవీందర్ జీతాలు రాక ఆత్మహత్యపై డీజీపీ దృష్టికి తెచ్చాము.ఇది రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ చేసిన హత్య.కేసీఆర్ పై హత్యా నేరం కింద క్రిమినల్ కేసులు పెట్టాలి.
రవీందర్ పిల్లల చదువుల ఖర్చు ప్రభుత్వమే భరించాలి.కుటుంబంలోఒకరికి ఉద్యోగం,… pic.twitter.com/QPB9i78MBA— Revanth Reddy (@revanth_anumula) September 8, 2023
సీఎం కేసీఆర్ రాజకీయ విజ్ఞతతో వ్యవహరించాలని సూచించారు. విజయభేరీ సభకు ఆటంకం కలిగించడం సరైంది కాదన్నారు. కేసీఆర్ చిల్లర ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. తుక్కుగూడలో సభ ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించామని ఆయన వెల్లడించారు. కనీవినీ ఎరుగని రీతిలో విజయభేరీ సభ నిర్వహించి తీరుతామని చెప్పారు.
