Revanth Reddy | 21వేల పోస్టులకు 5వేలతో డిఎస్సీతో మరో మోసం సీఎం కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి ధ్వజం కర్ణాటక మాదిరిగా తెలంగాణలోనూ హామీలన్ని అమలు విధాత : సీఎం కేసీఆర్ ప్రభుత్వం 5వేల పోస్టులతో డీఎస్సీ ప్రకటించడం ఎన్నికల దగా డీఎస్సీగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ట్వీట్టర్ ద్వారా, మీడియా సమావేశంలో తప్పుబట్టారు. విద్యాశాఖ గణాంకాల ప్రకారం 21 వేల పోస్టులు ఖాళీగా ఉంటే, సీఎం కేసీఆర్ మాటల మేరకు కూడా 13 వేల పోస్టుల ఖాళీగా […]

Revanth Reddy |

  • 21వేల పోస్టులకు 5వేలతో డిఎస్సీతో మరో మోసం
  • సీఎం కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి ధ్వజం
  • కర్ణాటక మాదిరిగా తెలంగాణలోనూ హామీలన్ని అమలు

విధాత : సీఎం కేసీఆర్ ప్రభుత్వం 5వేల పోస్టులతో డీఎస్సీ ప్రకటించడం ఎన్నికల దగా డీఎస్సీగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ట్వీట్టర్ ద్వారా, మీడియా సమావేశంలో తప్పుబట్టారు. విద్యాశాఖ గణాంకాల ప్రకారం 21 వేల పోస్టులు ఖాళీగా ఉంటే, సీఎం కేసీఆర్ మాటల మేరకు కూడా 13 వేల పోస్టుల ఖాళీగా ఉన్నాయన్నారు.

ప్రభుత్వం మాత్రం 5వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యగులను దగా చేసిందన్నారు. కేంద్రం గ్యాస్ సిలిండర్ ధర తగ్గించడంపై కూడా రేవంత్ రెడ్డి సెటర్ వేస్తూ ఒక గజదొంగ దారి దోపిడీ చేసి సర్వం దోచుకున్న తర్వాత దారి ఖర్చుల కోసం రూ.200 ఉంచోకోమని ఇచ్చిననట్లుగా కేంద్ర ప్రభుత్వం వైఖరి ఉందని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ హయాంలో గ్యాస్ బండ ధర రూ.410 ఉంటే దానిని మోడీ అధికారంలోకి వచ్చాక రూ. 1200 చేశారని దుయ్యబట్టారు. ఇన్నాళ్లు పేద మధ్యతరగతి ప్రజలను ఇబ్బందుల పాలు చేసి తీరా ఇప్పుడు గ్యాస్ ధర తగ్గించడాన్ని ఇలా కాకుండా మరెలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రధాన హామీల్లో ఒకటైన పేద మహిళకు నెలకు 2వేల సహాయం అందించే గృహ లక్ష్మి పథకాన్ని మైసూరులో రాహుల్ గాంధీ సమక్షంలో బుధవారం ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడంపై రేవంత్ స్పందిస్తూ చేతి గుర్తు మా చిహ్నం..చేసి చూపించడమే మా నైజం అన్నారు.

"కారు" కూతల "రావు" జుటా మాటలు మా వద్ద లేవు అని బీఆర్ఎస్ ప్రభుత్వంపై సెటైర్ వేశారు. ఇచ్చిన మాట ప్రకారమే అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే కర్ణాటక ప్రజలకు ఇచ్చిన 5 హామీల్లో నాలుగింటిని నెరవేర్చి చరిత్ర సృష్టించామన్నారు. మా మాట శిలాశాసనమని, మా బాట ప్రజా సంక్షేమమని, వస్తున్నాం తెలంగాణలోనూ..అమలు చేస్తున్నాం ఇచ్చిన హామీలను..మోసుకొస్తున్నాం చిరునవ్వులను అంటూ వ్యాఖ్యానించారు.

కాగా బుధవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ, బీఆరెస్ నేతలు జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసంలో కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ బస్తీలలో జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ హయాంలో జరిగిందన్నారు. బీఆరెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. తిరగబడదాం.. తరిమికొడదాం నినాదంతో ముందుకు వెళదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడి కార్మికులకు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ బాధితులకు, పైలేరియా డయాలిసిస్ పేషంట్లకు నెలకు రూ. 4 వేల పెన్షన్ ఇస్తామన్నారు.

2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేయడంతో పాటు రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5 లక్షల సాయం అందిస్తామని ప్రకటించారు.

Updated On 31 Aug 2023 3:16 AM GMT
somu

somu

Next Story