విధాత, తెలంగాణలో ఫిబ్రవరిలో అసెంబ్లీ రద్దయి మే నెలలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కోదాడలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కొడుకుని ముఖ్యమంత్రి చేసేందుకు సీఎం కేసీఆర్ ఈటెలను బీఆర్ఎస్ నుంచి గెంటాడని, కేసీఆర్ చేతిలో అవమాన పడిన ఎందరో తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఖమ్మం నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీలో చేరేందుకు చర్చలు కొనసాగుతు న్నాయన్నారు. మునుగోడు ఉప […]

విధాత, తెలంగాణలో ఫిబ్రవరిలో అసెంబ్లీ రద్దయి మే నెలలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కోదాడలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కొడుకుని ముఖ్యమంత్రి చేసేందుకు సీఎం కేసీఆర్ ఈటెలను బీఆర్ఎస్ నుంచి గెంటాడని, కేసీఆర్ చేతిలో అవమాన పడిన ఎందరో తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఖమ్మం నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీలో చేరేందుకు చర్చలు కొనసాగుతు న్నాయన్నారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగంతో గెలిచిందని, ఈ విషయం యావత్ భారత దేశానికి తెలుసన్నారు. ముఖ్యమంత్రి పోలీసుల అండతో గ్రామానికి ఒక ఎమ్మెల్యేని పెట్టి దుర్మార్గంగా గెలిచారని, ఎన్నికల్లో నైతికంగా బీజేపీ పార్టీదే విజయం అని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇదే విషయాన్ని ఘంటాపథంగా చెబుతున్నారు.

సీఎం కేసీఆర్ ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను ఐదు లక్షల కోట్ల అప్పుల పాలు చేశారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి దేశంలో ఎవరూ చేయలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో కేసిఆర్ ని గద్దింపాలని బిఆర్ఎస్ ను బొంద పెట్టాలని ధ్వజమెత్తారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజురాబాద్ ఎన్నికల్లో బీజేపీ విజయాలు సాధించిందని రాబోయే ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధిస్తుందన్నారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దేశంలో పూర్తిగా బలహీన పడిందన్నారు. బీఆర్ఎస్‌ను ఓడించేందుకు కాంగ్రెస్ నుంచి నాయకులు బీజేపీలోకి రావాలని ఆయన స్వాగతం పలికారు. బ్యాక్ గ్రౌండ్ లేని బ్లాక్మెయిలర్, చీటర్ రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అవ్వడం కాంగ్రెస్ పార్టీ దురదృష్టమన్నారు.

తమను రాజకీయంగా దెబ్బ తీసేందుకు సీఎం కేసీఆర్ మా పార్టీలోని వివేక్ వెంకటస్వామి, ఈటలకు, తనకు సామాజిక మాధ్యమాల్లో విభేదాలు సృష్టించేందుకు యత్నిస్తున్నారన్నారు. తామంతా ఐక్యంగా పనిచేస్తున్నామని ఎటువంటి ఆర్థిక లావాదేవీలు తమ మధ్య లేవన్నారు. ఈటల రాజేందర్ మచ్చలేని నాయకుడని కితాబు ఇచ్చారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రంలో బిజెపి ఎదుగుదలను ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బిఆర్ఎస్ పార్టీ పెట్టిన రోజే సీఎం కేసీఆర్ తన బొంద తాను తవ్వుకున్నాడని ఎద్దేవా చేశారు. ఖమ్మం సభకు కార్యకర్తలను బలవంతంగా తరలించారని, తుగ్లక్ లెక్క ప్రసంగం చేస్తుంటే జనం టీవీలు బంద్ చేసుకున్నారని ఎద్దేవా చేశారు.

పార్టీ నిర్ణయం మేరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడి నుంచి అయినా పోటీ చేసేందుకు తాను సిద్ధమేనన్నారు. అమిత్ షా, ప్రధాని మోడీ నాయకత్వంలో దేశంలో, రాష్ట్రంలో బిజెపి పార్టీ విజయం సాధిస్తుందని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఇకనుంచి తాను పర్యటిస్తానని ప్రతి కార్యకర్త కోసం వస్తానని చెప్పారు.

Updated On 22 Jan 2023 5:29 PM GMT
krs

krs

Next Story