Revanth Reddy చంద్రబాబు అరెస్టు వెనుక కేసీఆర్, మోడీలు కాంగ్రెస్ నేత మధుయాష్కి అరెస్టు చేసినట్లే చూస్తున్నామన్న రేవంత్‌ విధాత : చంద్రబాబు అరెస్టు వెనుక సీఎం కేసీఆర్‌, పీఎం మోడీల పాత్ర ఉందని కాంగ్రెస్‌ పార్టీ నేత మధుయాష్కిగౌడ్‌ ఆరోపించారు. చంద్రబాబు అరెస్టుపై కేసీఆర్‌ ఇంతవరకు స్పందింలేదని, బీజేపీ, బీఆరెస్‌, వైకాపాలు మూడు పార్టీలు మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకున్నాయన్నారు. గత ఎన్నికల్లో జగన్‌ గెలిచేందుకు కేసీఆర్‌ సూట్‌ కేసులు అందించారన్నారు. చంద్రబాబు అరెస్ట్ మీద స్పందించడానికి […]

Revanth Reddy

  • చంద్రబాబు అరెస్టు వెనుక కేసీఆర్, మోడీలు
  • కాంగ్రెస్ నేత మధుయాష్కి
  • అరెస్టు చేసినట్లే చూస్తున్నామన్న రేవంత్‌

విధాత : చంద్రబాబు అరెస్టు వెనుక సీఎం కేసీఆర్‌, పీఎం మోడీల పాత్ర ఉందని కాంగ్రెస్‌ పార్టీ నేత మధుయాష్కిగౌడ్‌ ఆరోపించారు. చంద్రబాబు అరెస్టుపై కేసీఆర్‌ ఇంతవరకు స్పందింలేదని, బీజేపీ, బీఆరెస్‌, వైకాపాలు మూడు పార్టీలు మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకున్నాయన్నారు. గత ఎన్నికల్లో జగన్‌ గెలిచేందుకు కేసీఆర్‌ సూట్‌ కేసులు అందించారన్నారు.

ఆ మూడు పార్టీల కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు గమనించాలన్నారు. కాగా చంద్రబాబు అరెస్టుపై పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిని విలేఖరులు ప్రశ్నించగా స్పందించడానికి నిరాకరించారు. చంద్రబాబు అరెస్టును ఎట్లా చూస్తున్నారన్న విలేఖరుల ప్రశ్నకు ఎట్ల చూస్తలేం..ఎట్ల జరుగుతుందో అట్లనే చూస్తున్నాం..అరెస్టు చేసినట్లే చూస్తాన్నాం అంటూ బదులిచ్చారు.

Updated On 19 Sep 2023 12:38 PM GMT
somu

somu

Next Story