Revanth Reddy
- వెల్లడించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
విధాత: ఆస్కార్ అవార్డ్ పొందిన కళాకారుడికి ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు ఇవ్వలేదని పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బోయిన్ పల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్ లో రాజీవ్ గాంధీ యూత్ ఆన్ లైన్ క్విజ్ కాంపిటేషన్ బ్రోచర్ ను రేవంత్ రెడ్డి విడుదల చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆస్కార్ అవార్డ్ గ్రహిత, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ హాజరు కాగా ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, ఏఐసీసీ సెక్రెటరీలు నదీమ్ జావీద్, రోహిత్ చౌదరి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తదితర నేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రేవంత్ మాట్లాడుతూ రాహుల్ సిప్లిగంజ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం సంతోషంగా ఉందన్నారు.
కాంగ్రెస్ తరపున రాహుల్ కు రూ.10లక్షలు నజరానా ప్రకటిస్తున్నామని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తమ ప్రభుత్వంలో రూ.కోటి నగదు బహుమతి అందిస్తామని తెలిపారు. బహుమతి ప్రధానం చేసేరోజు ప్రియాంక గాంధీని ఆహ్వానించి రాహుల్ ను సన్మానిస్తామన్నారు.
యూత్ డిక్లరేషన్ కు కొనసాగింపుగానే క్విజ్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నామని రేవంత్ తెలిపారు. రాష్ట్ర ఆర్భావ దినోత్సవమైన జూన్ 2న రాజీవ్ గాంధీ యూత్ ఆన్ లైన్ క్విజ్ కాంపిటీషన్ ఉంటుందన్నారు.