RGV offer
విధాత: ఆంధ్ర పాలిటిక్స్ మీద నిత్యం స్పందిస్తూ ఉండే రామ్ గోపాల్ వర్మకు టిడిపి అన్నా చంద్రబాబు అన్నా మా సెడ్డ ఎటకారం. లోకేష్, టిడిపి లేదా చంద్రబాబుల ట్విట్టర్, ఫేస్‌బుక్కు ఖాతాల నుంచి ఏదైనా పోస్ట్ వచ్చిందంటే చాలు క్షణాల్లో ఆర్జీవీ అలర్ట్ అయిపోతారు… వైసిపి కార్యకర్తల కన్నా .. వైసిపి సోషల్ మీడియా కుర్రాళ్ళ కన్నా ముందే ఆర్జీవీ ఎదురెళ్లి చంద్రబాబుతో పరాచికాలు ఆడతారు.
కడప ఎంపీ అవినాష్ ను ఎంతకూ అరెస్ట్ చేయడం లేదని బాధపడిపోతున్న చంద్రబాబు, అయన మద్దతుదారులైన మీడియా సంస్థలు రెండ్రోజులుగా ఈ అంశం మీద పలు చర్చలు… డిస్కషన్లు.. లైవ్ కవరేజీలు ఇస్తూ వచ్చారు. మొత్తానికి అవినాష్ అంశం సుప్రీం కోర్టుకు చేరింది. దీంతో బాగా నిరాశకు లోనైన చంద్రబాబు రాష్ట్రంలోని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు.. ఎమ్మెల్యేల మీద 408 కేసులు ఉన్నాయి.
ఒక్క ముఖ్యమంత్రి జగన్ మీదనే 11 సీబీఐ కేసులు.,, ఈడీ కేసులు … ఇంకా క్రిమినల్ కేసులు ఉన్నాయని, రాష్ట్రంలో న్యాయం, ధర్మం లేదని.. జగన్ అనుచరులు, నాయకులంతా అరాచకవాదులు… రాష్ట్రం నాశనం అయిపోతోంది అన్నట్లుగా పోస్టు పెట్టారు. దీనికి ఆర్జీవీ రెడీగా బడితె పట్టుకుని నిలబడిపోయారు. సరే… జగన్ మీద కేసులున్నాయని ఎన్నికలకు ముందే ప్రజలకు తెలుసు… అన్నీ తెలుసుకునే జనాలు ఓట్లేసి ఆయన్ను సీఎంగా చేసారు.
మరి ఒక్క కేసు కూడా మీ మీద లేవు కదా మరి మిమ్మల్ని ఎందుకు జనాలు ఇంటికి పంపించేశారు.. ఈ అంశం మీద చర్చకు సిద్ధం.. వస్తారా అంటూ ట్వీట్ చేసారు. ఇది కాస్తా వైరల్ ఐంది.. లక్షల మంది దీన్ని చూడగా వేలల్లో రీ ట్వీట్స్ చేసారు. మొత్తానికి చంద్రబాబుకు ఆర్జీవీ అప్పుడప్పుడు బాగానే తగులుకుంటున్నారు.