RGV | సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవలి కాలంలో ట్విట్టర్‌లో విచిత్రమైన పోస్ట్‌లు పెడుతూ నిత్యం హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాడు.నచ్చిని వారిపై ఏదో రకమైన ట్వీట్ పెట్టి వారితో చెడుగుడు ఆడుతుంటాడు. ఇటీవలి కాలంలో వర్మ సినిమాల కన్నా కూడా రాజకీయాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నాడు. జగన్‌ని సపోర్ట్ చేస్తూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేషన్‌లని గట్టిగా టార్గెట్ చేస్తూ వారిపై ప్రత్యేకంగా సినిమాలు తీస్తున్నాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి ఏదో […]

RGV |
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవలి కాలంలో ట్విట్టర్‌లో విచిత్రమైన పోస్ట్‌లు పెడుతూ నిత్యం హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాడు.నచ్చిని వారిపై ఏదో రకమైన ట్వీట్ పెట్టి వారితో చెడుగుడు ఆడుతుంటాడు. ఇటీవలి కాలంలో వర్మ సినిమాల కన్నా కూడా రాజకీయాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నాడు.
జగన్‌ని సపోర్ట్ చేస్తూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేషన్‌లని గట్టిగా టార్గెట్ చేస్తూ వారిపై ప్రత్యేకంగా సినిమాలు తీస్తున్నాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి ఏదో ఒక సెటైర్ వేస్తూ అందరి దృష్టి తనపై పడేలా చేస్తుంటాడు వర్మ. తాజాగా రామ్ గోపాల్ వర్మ తన సినిమా పోస్టర్‌ని పవన్ కళ్యాణ్ కాపీ కొట్టాడంటూ సంచలన ఆరోపణలు చేశాడు.
శనివారం అర్ధరాత్రి చంద్రబాబుని పోలీసులు అరెస్ట్ చేయడంతో రాష్ట్రం ఎంతలా అట్టుడికిపోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు చాలా మంది తమ మద్దతుని అందిస్తున్నారు.ఇక జనసేనాని పవన్ కళ్యాణ్… హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి బాబును పరామర్శించాలి అనుకున్నారు.
అయితే అడుగడుగున పవన్ కళ్యాణ్‌ని పోలీసులు అడ్డుకున్నారు.ఆ సమయంలో కోపంతో ఊగిపోయిన పవన్ నడిరోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు. కొద్ది సేపు కాలుపై కాలు వేసుకొని రోడ్డుపై పడుకున్న పవన్ ఆ తర్వాత కొద్ది సేపు కూర్చున్నారు. అనంతరం కారెక్కి కూడా నిరసన తెలియజేశారు.పవన్ నిరసనకి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.
అయితే ఆ ఫొటోలకి వర్మ… పవర్ స్టార్ పై సెటైర్లు పేలుస్తూ.. ట్వీట్ చేశాడు. రోడ్డు మీద పవన్ కళ్యాణ్ కాలు మీద కాలు వేసుకుని పడుకున్న ఫోటోను వర్మ ట్వీట్ చేస్తూ.. తాను వ్యూహం సినిమా కోసం రిలీజ్ చేసిన ఫొటోని కాపీ కొట్టాడంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. నేను నెలకింద వ్యూహం సినిమాలో రిలీజ్ చేసిన ఫోటో.. కింద రియల్ ఫోటో అంటూ పవన్‌పై సెటైర్ వేస్తున్నట్టుగా ట్వీట్ చేశారు ఆర్జీవి.
ప్రస్తుతం వర్మ షేర్ చేసిన పిక్స్ నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇక వర్మ ప్రస్తుతం వైఎస్ జగన్ బయోపిక్ మూవీగా వ్యూహం అనే సినిమా చేస్తున్నారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు చంద్రబాబును కూడా విలన్లుగా చూపించబోతున్నట్టు తెలుస్తోంది. ఎలక్షన్స్‌కి కొద్ది రోజుల ముందు ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.
