Wednesday, March 29, 2023
More
    HomelatestRGV సార్‌.. మీరు మారిపోయారు! ఓ కుక్క మీ జీవితాన్నే మార్చేసింది

    RGV సార్‌.. మీరు మారిపోయారు! ఓ కుక్క మీ జీవితాన్నే మార్చేసింది

    • ఆర్జీవీలో ఈ కోణం కూడా ఉందా..?
    • కుక్కల దాడి మృతుడికి నిధుల సేకరణ

    విధాత: కొన్ని సందర్భాల్లో కొన్ని అంశాల పట్ల సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గొప్పగా స్పందిస్తాడు. సామాజిక అంశాలపై తన అభిప్రాయాలూ, స్పందనలు తెలియజేసే ఆర్జీవీ కొన్ని సందర్భాల్లో కొందరికి అనివార్యంగా వ్యతిరేకిగా మారుతుంటాడు. ఈ క్రమంలో కొన్ని వర్గాలకు శత్రువుగా కూడా మారుతుంటాడు.

    చంద్రబాబును, లోకేష్‌ను టార్గెట్ చేస్తూ టీడీపీ క్యాడర్‌కు శత్రువుగా మారుతున్నాడు ఇంకా మెగా ఫ్యామిలీని విమర్శించి వారి అభిమానుల ఆగ్రహానికి గురవుతుంటారు.. ఇలా పలు రకాల వార్తలు.. వివాదాల్లో ఉంటూ వస్తున్న ఆర్జీవిలో నేడు ఓ మానవీయ కోణం ఆవిష్కృతమైంది.

    కష్టానికి చలించే సున్నిత హృదయం కూడా ఆయనలో ఉందని లోకానికి తెలిసిన రోజిది. వాస్తవానికి మొన్నామధ్య వీధికుక్కల దాడిలో ఆరేళ్ళ చిన్నారి ప్రదీప్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.. అయితే ఆ ఘటన మీద ఆర్జీవి ఆనాడే గట్టిగా స్పందించారు.

    మేయర్ తన ఇంట్లో కుక్కలకు అన్నం తినిపిస్తున్న వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ మేయర్‌ను కుక్కల మందలో వదిలేయాలి.. అప్పుడే ఆమెకు బుద్ధి వస్తుంది అన్నట్లుగా కామెంట్ పెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ కిక్కురుమనలేదు కానీ ఆయన మాత్రం ప్రభుత్వాన్ని, నగరపాలక సంస్థను దుమ్ము దులిపేశారు.

    ఆయన అక్కడితో ఆగిపోకుండా ట్విట్టర్లో ఓ పోస్ట్ పెడుతూ పిల్లాడి కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు నిధుల సేకరణకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే కొందరు ధార్మికులు డబ్బులు ఆయన చెప్పిన ఆకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండగా కొందరు మాత్రం .. మీరు మారిపోయారు సర్.. ఒక కుక్క మీ జీవితాన్నే మార్చేసింది అని ట్వీట్ చేశారు.

    మొత్తానికి ఆర్జీవి పుణ్యాన ఆ కుటుంబానికి కొంత ఆర్థిక సాయం అందుతుందన్నమాట. వాస్తవానికి బాధిత కుటుంబానికి అటు ప్రభుత్వం నుంచి గానీ హైదరాబాద్ కార్పోరేషన్ నుంచిగానీ కనీసం ఊరడింపు లేదు.. రూపాయి సాయం కూడా అందలేదు. ఆ ఘటన జరిగిన మరునాడు అధికారులతో సీజన్న మీటింగ్ పెట్టి వదిలేసిన HMDAకు ఈ ఆర్జీవి చేపట్టిన నిధుల సేకరణ ఓ గుణపాఠం అవుతుందా..ఇకనైనా వారు సిగ్గు తెచ్చుకుంటారా చెప్పడాలి.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular