విధాత, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా భిక్కనూరు వద్ద 44 నెంబర్ జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. భిక్కనూరు ఎస్ఐ ఆనంద్ గౌడ్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
గురువారం మధ్యాహ్నం 12:30 గంటలకు భిక్కనూరు మండల శివారులోని చర్చి గేటు వద్ద జాతీయ రహదారిపై మెదక్ జిల్లా నార్లాపూర్ గ్రామానికి చెందిన బి లింగం అక్కడికక్కడే మృతి చెందాడు.
రామయంపేట్ వైపు నుంచి బిక్కనూరు వైపు టీవీఎస్ చాంప్ పై వస్తుండగా లారీ ఢీకొనడంతో టీవీఎస్ చాంప్ నుండి కింద తీవ్ర గాయంలో అక్కడికక్కడే మృతిచెందాడు. భిక్కనూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ ఆనంద్ గౌడ్ తెలిపారు.