Siddipet | ఆగి ఉన్న లారీని ఢీకొన్న క్వాలిస్ ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి విధాత, మెదక్ బ్యూరో: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అనంత సాగర్ శివారులో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఇసుక లారీని.. వెనుక వైపు నుంచి క్వాలీస్ వాహనం ఢీకొంది. ఘటనలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలివి. సిద్దిపేట ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 11 […]

Siddipet |

  • ఆగి ఉన్న లారీని ఢీకొన్న క్వాలిస్
  • ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి

విధాత, మెదక్ బ్యూరో: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అనంత సాగర్ శివారులో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఇసుక లారీని.. వెనుక వైపు నుంచి క్వాలీస్ వాహనం ఢీకొంది.
ఘటనలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలివి. సిద్దిపేట ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 11 మంది క్వాలిస్ వాహనంలో కరీంనగర్ లోని తిమ్మాపూర్ లో పరీక్ష రాసేందుకు వెళ్లారు.

తిరుగు ప్రయాణంలో అదే వాహనంలో వస్తుండగా, చిన్న కోడూరు మండలం అనంత సాగర్ శివారులో ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఇసుక లారీని వెనుక నుంచి క్వాలీస్ ఢీకొంది. ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థినులు నితిన్ , గ్రీష్మ, నమ్రత అక్కడికక్కడే మృతి చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, క్షతగాత్రులను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థు లంతా సిద్దిపేట ప్రాంత వాసులుగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated On 12 Sep 2023 11:58 AM GMT
somu

somu

Next Story