విధాత‌: యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే) చరిత్రలో తొలిసారిగా ఒక రోబో పార్లమెంటులో ప్రసంగించింది. 2019లో ఐడాన్‌ మెలెర్‌ ఆవిష్కరించిన ఈ రోబోను బ్రిటిష్‌ గణిత శాస్త్రజ్ఞుడు అడా లవ్‌లేస్‌ పేరిట ఐ-డా గా పిలుస్తున్నారు. ఇప్పటికే బోస్టన్‌ డైనమిక్స్‌కు చెందిన రోబో శునకం, హాంకాంగ్‌కు చెందిన రోబో సోఫియా ప్రపంచం దృష్టిని ఆకర్షించిన సంగతి విధిత‌మే. తాజాగా ఐడా కూడా ఆ కోవలో చేరింది. తనకు జీవం లేకపోయినా కళను తాను ఉత్పత్తి చేయగలనని తన ప్రసంగంలో […]

విధాత‌: యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే) చరిత్రలో తొలిసారిగా ఒక రోబో పార్లమెంటులో ప్రసంగించింది. 2019లో ఐడాన్‌ మెలెర్‌ ఆవిష్కరించిన ఈ రోబోను బ్రిటిష్‌ గణిత శాస్త్రజ్ఞుడు అడా లవ్‌లేస్‌ పేరిట ఐ-డా గా పిలుస్తున్నారు. ఇప్పటికే బోస్టన్‌ డైనమిక్స్‌కు చెందిన రోబో శునకం, హాంకాంగ్‌కు చెందిన రోబో సోఫియా ప్రపంచం దృష్టిని ఆకర్షించిన సంగతి విధిత‌మే.

తాజాగా ఐడా కూడా ఆ కోవలో చేరింది. తనకు జీవం లేకపోయినా కళను తాను ఉత్పత్తి చేయగలనని తన ప్రసంగంలో పేర్కొంది. ‘‘మీకు ఉన్న ఆలోచన శక్తి నాకు లేదు. కానీ నాకు ఊహాశక్తి ఉంది. ఆ ఊహ నుంచి కళను చిత్రించగలను’’ అని ఐడా పేర్కొంది. అయితే.. సాంకేతిక లోపం వల్ల ప్రసంగం మధ్యలో ఐడాకు మెల్లకన్ను రావడం అంద‌రిని ఆశ్చ‌ర్య‌నికి గురి చేసింది.

Updated On 13 Oct 2022 7:24 AM GMT
Somu

Somu

Next Story