విధాత: జబర్దస్త్ కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం సినిమాలలో బిజీగా మారి హీరోగా కూడా నటిస్తున్న కమెడియన్ సుడిగాలి సుధీర్. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది మంచి స్నేహితులనే విషయం తెలియంది కాదు. ఇక విషయానికొస్తే నేడు రాజకీయాలలో సినీ గ్లామర్ ఎక్కువవుతుంది. ఒకవైపు వైసీపీలో అలీ, పోసాని కృష్ణమురళి, 30 ఇయర్స్ పృథ్వీ వంటి వారు ఉండేవారు.
వీరిలో పృథ్వీ వైసీపీతో తెగతెంపులు చేసుకొని ప్రస్తుతం జనసేనకు మద్దతు దారునిగా మారాడు. హైపర్ ఆది మొదటి నుంచి పవన్‌కు వీరాభిమాని. ఆయన పవన్‌కు సపోర్ట్ చేస్తూ జబర్దస్త్‌లో కూడా పలు స్కిట్లు చేశాడు. ఇటీవల జరిగిన జనసేన యువశక్తి సభలో హైపర్ ఆది చేసిన ప్రసంగం అందర్నీ ఎంతగానో అలరించింది. ఆయన వేసిన పంచులు వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేశాయి. దాంతో ఏపీ మంత్రి ఒకనాడు సీనియర్ హీరోయిన్ రోజా కూడా హైపర్ ఆది కామెంట్స్ పై కౌంటర్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.
తాను జడ్జిగా ఉండగా ఆ షోలో కమెడియన్‌గా చేసిన హైపర్ ఆది కౌంటర్లకు ఏకంగా ఏపీ మంత్రి అయినా రోజా సమాధానమిచ్చింది అంటే హైపర్ ఆది చేసిన ప్రసంగం ఎంతగా ప్రజలను మెప్పించిందో, వైసీపీ నాయకులకు ఇబ్బంది కలిగించిందో అర్థం చేసుకోవచ్చు.
ఇదే సమయంలో హైపర్ ఆది స్నేహితుడైన సుడిగాలి సుధీర్‌పై వైసీపీ పార్టీ బాగా ఒత్తిడి చేస్తుందట. మరీ ముఖ్యంగా రోజా.. సుడిగాలి సుధీర్‌ను వైసీపీ పార్టీకి మద్దతుదారునిగా ఉండాలని హైపర్ ఆదికి సరైన కౌంటర్లు వేసే స్థాయికి ఎదగాలని ఒత్తిడి చేస్తుందని సమాచారం. హైపర్ ఆది వేసే సెటైర్లకు సుడిగాలి సుధీర్ ద్వారా కౌంటర్ అనేది రోజా ఉద్దేశంగా తెలుస్తోంది.
అయితే సుధీర్ కూడా పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని. దాంతో ఆయన రోజా ఒత్తిడికి తలొగ్గి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. అలా రాజకీయాలలో ఈ జబర్దస్త్ కమెడియన్స్ ఈ మధ్య తలదూర్చడం కామన్ అయిపోయింది. ఏదో ఒక పార్టీ స్టాండ్ తీసుకోవడం వల్ల వీళ్ళ కెరీర్‌పై ఏమైనా ప్రభావం పడుతుందా? అనేది కూడా వారు ఆలోచించుకోవాల్సి ఉంటుంది మరి.