HomelatestRRR Actor Ray Stevenson | ఆర్‌ఆర్‌ఆర్‌ నటుడు రే స్టీవెన్స్‌ కన్నుమూత.. నివాళులర్పించిన టీమ్‌..!

RRR Actor Ray Stevenson | ఆర్‌ఆర్‌ఆర్‌ నటుడు రే స్టీవెన్స్‌ కన్నుమూత.. నివాళులర్పించిన టీమ్‌..!

RRR Actor Ray Stevenson |

టాలీవుడ్‌ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో విలన్‌గా నటించిన రే స్టీవెన్సన్‌ (58) కన్నుమూశారు. ఐరిష్‌ నటుడు ఆదివారం తుదిశ్వాస విడిచినట్లు ఆయన ప్రతినిధులు తెలిపారు. మరణానికి గల కారణాలు తెలియరాలేదు.

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో రే స్టీవెన్సన్‌ గవర్నర్‌ స్కాట్‌ బక్స్‌టన్‌ పాత్రలో నటించి.. మెప్పించారు. 1964 మే 25న జన్మించిన స్టీవెన్సన్‌ హాలీవుడ్‌లో ‘థోర్‌’ సిరీస్‌లతో నటించి మెప్పించారు. ఆయన మృతి వార్త తెలుసుకొని అభిమానులు షాక్‌కు గురయ్యారు.

స్టీవెన్సన్‌ మృతికి ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ‘ఈ వార్త మమ్మల్ని ఎంతో షాక్‌కు గురిచేసింది. మీ ఆత్మకు శాంతి కలగాలి. మీరెప్పటికీ మా హృదయాల్లో నిలిచే ఉంటారు’ అంటూ ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ ట్వీట్‌ చేసింది.

స్టీవెన్సన్ ఉత్తర ఐర్లాండ్‌లోని లిస్బర్న్‌లో 1964లో జన్మించాడు. ఆయనకు ఇద్దరు సోదరులు ఉన్నారు. బ్రిస్టల్ ఓల్డ్ విక్ థియేటర్ స్కూల్‌లో చదివిన తర్వాత, బ్రిటీష్ టెలివిజన్‌లో సంవత్సరాలపాటు పనిచేశారు. పాల్ గ్రీన్‌గ్రాస్ 1998 చిత్రం ‘ది థియరీ ఆఫ్ ఫ్లైట్లో’ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

తర్వాత గ్రీన్‌విచ్‌ మీన్‌ టైమ్‌ ఇన్‌ 1999, కింగ్‌ ఆర్థర్‌, పనిషర్‌ వార్‌ జోన్‌, బుక్‌ ఆఫ్‌ ఎలీ, ది అదర్‌ గాయ్స్‌, జో రిటాలియేషన్‌, డివర్జెంట్, ది ట్రాన్స్‌పోర్టర్‌: రిప్యూల్‌డ్‌, యాక్సిడెంట్‌ మ్యాన్‌, మెమొరీ, థోర్‌ సిరీస్‌లతో నటించి.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సాధించుకున్నారు.

డెక్స్‌టార్‌, స్టార్‌వార్స్‌ రెబెల్స్‌ లాంటి టీవీ షోలతోనూ ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఆయన చివరిగా నటించిన డిస్నీ+‘అశోకా’ సిరీస్‌ త్వరలో విడుదల కానున్నది.

 

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular