విధాత: పాన్ ఇండియా సినిమాగా రామ్ చరణ్, ఎన్టీయార్, అలియాభట్, అజయ్ దేవగన్ వంటి భారీ తారాగణంతో వచ్చిన RRR చిత్ర రచయితగా గొప్ప పేరు, ఆ వెంటనే రాజ్యసభ పోస్ట్ దక్కించుకున్న విజయేంద్ర ప్రసాద్‌కుకు ఇది చేదు వార్తే.. కానీ తప్పదు.. తనకు ఆరేళ్లపాటు భోగభాగ్యాలు దక్కించిన RRR చిత్రం మాత్రం దేశం నుంచి ఆస్కార్‌కు మాత్రం ఎంట్రీల్లో నిలవలేక పోయింది. జాతీయ స్థాయిలో భారీగా పబ్లిసిటీతో బాటు భారీ రికార్డులు బ్రేక్ చేసిన ఈ […]

విధాత: పాన్ ఇండియా సినిమాగా రామ్ చరణ్, ఎన్టీయార్, అలియాభట్, అజయ్ దేవగన్ వంటి భారీ తారాగణంతో వచ్చిన RRR చిత్ర రచయితగా గొప్ప పేరు, ఆ వెంటనే రాజ్యసభ పోస్ట్ దక్కించుకున్న విజయేంద్ర ప్రసాద్‌కుకు ఇది చేదు వార్తే.. కానీ తప్పదు.. తనకు ఆరేళ్లపాటు భోగభాగ్యాలు దక్కించిన RRR చిత్రం మాత్రం దేశం నుంచి ఆస్కార్‌కు మాత్రం ఎంట్రీల్లో నిలవలేక పోయింది.

జాతీయ స్థాయిలో భారీగా పబ్లిసిటీతో బాటు భారీ రికార్డులు బ్రేక్ చేసిన ఈ చిత్రం సినీ ఇండస్ట్రీలో ఓ మైలు రాయిలా నిలిచింది. అందులోని నటీనటులు ఎన్టీయార్, రామ్ చరణ్ ఇతరులకు సైతం మంచి పాపులారిటీ వచ్చింది. కలెక్షన్ల పరంగానూ భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఈ చిత్రానికి పని చేసిన టెక్నీషియన్లకూ ఆ తరువాత మంచి ఆఫర్లు వచ్చాయ్.

ఇక ఆ చిత్ర కథ రచయిత విజయేంద్రప్రసాద్ (దర్శకుడు రాజమౌళి తండ్రి) అయితే RSS ప్రాపకంతో ఎవరూ ఊహించని రీతిలో ఏకంగా రాజ్యసభకు ఎంపికయ్యారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎంపికైన నలుగురిలో విజయేంద్ర ప్రసాద్ కూడా ఉండడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

అంటే ఈయనకు కేంద్రంలో ఎంత హోల్డ్ ఉందన్నది అందరికి అవగతమైంది. పార్టీకి ఏమీ చేయని తనకు ఇంత పెద్ద పదవి ఇచ్చిన బీజేపీ తన చిత్రానికి కూడా బాగానే ప్రయార్టీ ఇస్తుందని ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు ఆశించారు.

కానీ చివరకు గుజరాత్ చిత్రం ‘చెల్లో షో’ ను భారత్ నుంచి ఆస్కార్‌కు అధికారిక ఎంట్రీగా పంపుతున్నారు. అంటే RRR టీమ్ సభ్యులు.. విజయేంద్రప్రసాద్ సైతం కాస్త డిసప్పాయింటయ్యే ఉంటారు.. మొత్తానికి ఈ చిత్రం ద్వారా రచయితకు రాజ్యసభ అయితే దక్కింది కానీ ఆస్కార్ ఎంట్రీ మాత్రం దొరకలేదు.

Updated On 21 Sep 2022 3:51 PM GMT
krs

krs

Next Story