RRR Movie | దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా(RRR Movie)కు అంతర్జాతీయ అవార్డులు కొనసాగుతున్నాయి. ‘నాటు నాటు’ సాంగ్‌ (Natu Natu Song) గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల్లో ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ను గెలుచుకొని చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం ఆస్కార్‌ రేసులో ఉన్నది. ఈ అవార్డులకు ముందు ఆర్‌ఆర్‌ఆర్‌ హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ అవార్డులను దక్కించుకున్నది. దేశం మరోసారి గర్వించేలా 4 విభాగాల్లో అవార్డులు గెలుచుకున్నది. బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం, బెస్ట్‌ యాక్షన్ చిత్రం, బెస్ట్‌ […]

RRR Movie | దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా(RRR Movie)కు అంతర్జాతీయ అవార్డులు కొనసాగుతున్నాయి. ‘నాటు నాటు’ సాంగ్‌ (Natu Natu Song) గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల్లో ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ను గెలుచుకొని చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం ఆస్కార్‌ రేసులో ఉన్నది. ఈ అవార్డులకు ముందు ఆర్‌ఆర్‌ఆర్‌ హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ అవార్డులను దక్కించుకున్నది. దేశం మరోసారి గర్వించేలా 4 విభాగాల్లో అవార్డులు గెలుచుకున్నది. బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం, బెస్ట్‌ యాక్షన్ చిత్రం, బెస్ట్‌ స్టంట్స్, బెస్ట్‌ సాంగ్‌ (నాటు నాటు) కేటగిరిలో అవార్డులు వరించాయి. రాజమౌళి, కీరవాణి, రామ్‌చరణ్‌ ఈ అవార్డులను అందుకున్నారు. బెస్ట్‌ పిక్చర్‌, బెస్ట్‌ డైరెక్టర్‌ కేటగిరీల్లోనూ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా హెచ్‌సీఏ అవార్డుల కోసం నామినేట్‌ అయ్యింది.

కానీ, రెండు కేటగిరీల్లో ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ ది వన్స్‌ సినిమా అవార్డులు గెలుచుకున్నది. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో అత్యుత్తమ విన్యాసాలు గుర్తించిన హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. సినిమాలో కంపోజ్‌ చేసేందుకు సాల్మన్‌ కష్టపడ్డారని, క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్సుల్లో తీయడానికి స్టంట్‌ మాస్టర్‌ జూజీ చాలా సాయం చేశారని కొనియాడారు. ఎన్టీఆర్ రామ్ చరణ్‌ చిత్రంలో అద్భుతంగా నటించారని, రెండు మూడు షాట్స్‌లో మాత్రమే మాత్రమే బాడీ డబుల్స్‌ ఉపయోగించామని, మిగతా యాక్షన్ సీన్లు అన్నిటిలో వాళ్లే సొంతంగా చేశారన్నారు. ఈ క్రెడిట్‌ అంతా టీమ్‌కేనంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాజమౌళి స్పీచ్‌ వీడియోను చిత్రబృందం ట్వీట్‌ చేసింది.

Updated On 26 Feb 2023 2:28 AM GMT
cm

cm

Next Story