Natu Natu Win Oscar | విశ్వ వేదికపై తెలుగు సినిమా సత్తా చాటింది. తెలుగు సినిమా చరిత్ర ఎల్లలు దాటింది. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని ‘నాటునాటు’ పాట ఆస్కార్ అవార్డును గెలుపొందింది. ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ సాంగ్ నామినేట్ అయ్యింది.
విశ్వవేదికపై తెలుగు సినిమా సత్తా.. ‘నాటు నాటు’ సాంగ్‌కు ఆస్కార్ అవార్డు https://t.co/pl0P37uS6J #rrr #AcademyAwards #NaatuNaatuForOscars #NaatuNaatuSong #NaatuNaatu #SSRajamouli #RamCharanBossingOscars @RRRMovie #RRRMovie #ProudMoment #India #Oscars95 #TheElephantWhisperers pic.twitter.com/yU3sA9Wa81
— vidhaathanews (@vidhaathanews) March 13, 2023
ఈ పాటతో పాటు మరో నాలుగు సినిమాల పాటలు పోటీ పడ్డాయి. ఒరిజినల్ సాంగ్ కేటగిరి విభాగంలో మొత్తం 81 పాటలు పోటీ పడగా, 15 పాటలను షార్ట్ లిస్ట్ చేశారు. అందులో నుంచి ఐదు పాటలు నామినేట్ కాగా, నాటు నాటు పాట ఆ ఐదింటిలో చోటు దక్కించుకుంది.
ఆస్కార్స్: నాడు శిష్యుడు రెహమాన్.. ఇప్పుడు గురువు కీరవాణి..!
Proud Moment For The Country(🇮🇳)🥹😭👏❤️.
Global Sensational @RRRMovie won 95th @TheAcademy Award in Best Original Song Caterogy #NaatuNaatu 🕺💃 🥵❤️🔥. #Oscars95 #Oscars2023
Congratulations @tarak9999 @AlwaysRamCharan @ssrajamouli @mmkeeravaani and Team 🎊🎉💥. #RRRMovie pic.twitter.com/OGPc7gR9KS
— Sai Mohan 'NTR' (@Sai_Mohan_999) March 13, 2023
అప్లాజ్ నుంచి టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్ సాంగ్, టాప్ గన్.. మావెరిక్ నుంచి హోల్డ్ మై హ్యాండ్, బ్లాక్ పాంథర్ నుంచి లిస్ట్ మీ అప్, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ నుంచి దిస్ ఈజ్ ఏ లైఫ్ సాంగ్ పోటీ పడ్డాయి. చివరకు ‘నాటు నాటు’ సాంగ్ అకాడమీ అవార్డును సొంతం చేసుకున్నది. ‘నాటు నాటు’ సాంగ్‌ను ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ రాయగా.. ఎంఎం కిరవాణి స్వరాలు సమకూర్చారు.
పాటగాడి నాటు దెబ్బ.. ఆస్కార్ రేసులో ఓరుగల్లు బిడ్డ చంద్రబోస్ పాట
రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించారు. గతేడాది మార్చిలో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నది. హీరోలు రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తమ నటనతో ఆకట్టుకున్నారు. వేదికపై గేయ రచయిత చంద్రబోస్, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అవార్డును అందుకున్నారు.
‘Naatu Naatu’ from ‘RRR’ wins the Oscar for Best Original Song! #Oscars #Oscars95 pic.twitter.com/tLDCh6zwmn
— The Academy (@TheAcademy) March 13, 2023
“If you don’t know Naatu, your about to” 😅#DeepikaPadukone announces #NaatuNaatu performance at #Oscars 🤩#RRRMovie | #AcademyAwards
— Abhi (@abhi_is_online) March 13, 2023