Rs 2000 Note | రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా రూ.2వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్‌ 30 వరకు చెలమణిలో ఉంటుందని, అప్పటిలోగా బ్యాంకుల్లో మార్చుకోవచ్చని తెలిపింది. అయితే, పింక్‌ నోట్లను మార్చుకునేందుకు జనం తంటాలు పడుతున్నారు. చాలా దుకాణాల్లో వ్యాపారులను నోట్లను తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. పెట్రోల్‌ బంకుల్లో సైతం ఇదే దుస్థితి నెలకొన్నది. చాలా మంది రూ.2వేల నోట్లతోనే పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేస్తుండడంతో వ్యాపారులు సైతం తలలు పట్టుకుంటున్నారు. ఈ గందరగోళ పరిస్థితిని […]

Rs 2000 Note |

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా రూ.2వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్‌ 30 వరకు చెలమణిలో ఉంటుందని, అప్పటిలోగా బ్యాంకుల్లో మార్చుకోవచ్చని తెలిపింది. అయితే, పింక్‌ నోట్లను మార్చుకునేందుకు జనం తంటాలు పడుతున్నారు.

చాలా దుకాణాల్లో వ్యాపారులను నోట్లను తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. పెట్రోల్‌ బంకుల్లో సైతం ఇదే దుస్థితి నెలకొన్నది. చాలా మంది రూ.2వేల నోట్లతోనే పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేస్తుండడంతో వ్యాపారులు సైతం తలలు పట్టుకుంటున్నారు. ఈ గందరగోళ పరిస్థితిని ఓ వ్యాపారి తనకు అనుకూలంగా మార్చుకున్నాడు.

ఢిల్లీలోని జీబీటీనగర్‌కు చెందిన మీట్‌ వ్యాపారి వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించాడు. రూ.2వేలతో మీట్‌ను కొనుగోలు చేస్తే రూ.2100 విలువైన వస్తువులు ఇవ్వనున్నట్లు తెలిపాడు. ఇందుకు సంబంధించి దుకాణం మొత్తం పోస్టర్‌ను ఏర్పాటు చేశాడు. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన చాలా మంది ఆ దుకానానికి క్యూకడుతున్నారు.

సదరు వ్యాపారిపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఆర్బీఐ తనను తాను తెలివైందిగా భావిస్తే ఢిల్లీ వాసులు అంతకంటే తెలివైనవారని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. గత శుక్రవారం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పింక్‌ నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది.

నోట్ల మార్పిడికి సెప్టెంబర్‌ 30 వరకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. మంగళవారం నుంచి బ్యాంకుల్లో రోజుకు రూ.20వేల విలువైన నోట్లను మార్చుకునేందుకు అవకాశం ఇచ్చింది. గడువు ముగిసే వరకు రూ.2వేలనోట్లు చెలమణిలో ఉంటాయని ఆర్‌బీఐ ప్రకటించినా.. చాలా చోట్ల వ్యాపారులు నోట్లను స్వీకరించేందుకు నిరాకరిస్తున్నారు.

బ్యాంకు వెళ్లి నోట్లను మార్చుకోవాల్సి ఉండడంతో ఇందుకు నిరాకరిస్తున్నారు. మరో వైపు నోట్ల ఉపసంహరణతో క్యాష్‌ ఆన్‌ డెలివరీ ఆర్డర్లు పెరిగాయని జొమాటో తెలిపింది. చాలా మంది రూ.2వేల నోట్లతో చెల్లింపులు చేస్తున్నారని, రూ.2000 నోటుతో 70శాతం బిల్లు చెల్లింపులు చేస్తున్నారని కంపెనీ వివరించింది.

Updated On 25 May 2023 11:28 AM GMT
Vineela

Vineela

Next Story