ఉన్నమాట: ఇంటిగుట్టు లంకకు చేటన్నది మరోసారి రుజువైంది. ఒకరితో ఒకరికి పొసగక, ఒకరిగుట్టు ఇంకొకరు బయట పెట్టుకుంటూ మొత్తం పుట్టి ముంచేసేలా తయారైంది విశాఖలో వైసీపీ ఎంపీల వ్యవహారం. రాజకీయ నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం.. ఆధిపత్య పోరు.. ఒకరి పరిధిలోకి.. ఒకరి వ్యాపార సామ్రాజ్యంలోకి ఇంకోరు చొరబడడం.. ఇది కాస్తా వర్గ పోరుకు దారితీయడం. ఇవన్నీ చాన్నాళ్లుగా ఉన్నవే. ఒకరి ఎదుగుదలను ఓర్వలేక ఆయన్ను మళ్ళీ నేలమట్టం చేసేందుకు ఇవతలి వర్గం వారు అనైతిక వ్యవహారాలకు.. […]

ఉన్నమాట: ఇంటిగుట్టు లంకకు చేటన్నది మరోసారి రుజువైంది. ఒకరితో ఒకరికి పొసగక, ఒకరిగుట్టు ఇంకొకరు బయట పెట్టుకుంటూ మొత్తం పుట్టి ముంచేసేలా తయారైంది విశాఖలో వైసీపీ ఎంపీల వ్యవహారం. రాజకీయ నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం.. ఆధిపత్య పోరు.. ఒకరి పరిధిలోకి.. ఒకరి వ్యాపార సామ్రాజ్యంలోకి ఇంకోరు చొరబడడం.. ఇది కాస్తా వర్గ పోరుకు దారితీయడం.

ఇవన్నీ చాన్నాళ్లుగా ఉన్నవే. ఒకరి ఎదుగుదలను ఓర్వలేక ఆయన్ను మళ్ళీ నేలమట్టం చేసేందుకు ఇవతలి వర్గం వారు అనైతిక వ్యవహారాలకు.. కుట్రలకు పాల్పడడం కూడా సహజమే.. ఇటీవల థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీని కూడా భక్తి ఛానెల్ నుంచి ఈ విధంగానే తరిమేసిన తీరు తెలిసిందే.

ఇప్పుడు విశాఖలో ఇద్దరు ఎంపీలు ఎంవివి సత్యనారాయణ.. వైస్సార్సీపీలో నంబర్ టూగా చెలామణి అవుతున్న విజయసాయి రెడ్డిల మధ్య చెలరేగిన విభేదాలు చివరకు ఒకరి అక్రమాలను ఇంకొకరు బయట పెట్టుకునే స్థితికి దారి తీసింది. విశాఖ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూములు.. రైతుల దగ్గరున్న వివాదాస్పద భూములను విజయసాయి రెడ్డి చవగ్గా కొన్ని.. రికార్డులు మార్చేసి ఇంకొన్ని తన బంధువుల పేర్లమీద్ మార్చేసుకున్నారని.. ఇంకొన్ని అయితే భూ యజమానులను భయపెట్టి చవగ్గా ఎంతో కొంత ఇచ్చి రాయించుకున్నారని మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే ఈ వివరాలు అన్నీ సేకరించి వైరి వర్గానికి చెందిన మీడియాకు అందించింది తమ పార్టీకి చెందిన లోక్ సభ సభ్యుడు ఎంవివి సత్యనారాయణ అని ఇటు విజయసాయిరెడ్డి, ఆయన అనుచర నాయకులు లోలోన అనుమానిస్తున్నారు కానీ ఎక్కడా బయటపడడం లేదు. కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుంది. మా పార్టీ నాయకుడే ఇలా నన్ను బదనాం చేస్తున్నాడని పాపం విజయసాయి బయటకు చెప్పుకోలేక లోలోన మథనపడుతున్నారు.

ఇదే టైములో అవకాశం కోసం ఎదురుచూస్తూ ఇప్పుడు ఎదురు దాడి చేస్తున్నారని అంటున్నారు. ఏ మీడియాను వేదికగా చేసుకుని తనను ఎంవివి బదనాం చేశారో ఇప్పుడు అదే అస్త్రాన్ని ఇటు విజయసాయి వాడారని అంటున్నారు. తాజాగా అదే మీడియాలో ఎంవివి సత్యనారాయణ కూర్మన్నపాలెంలో ఓ 11 ఎకరాల ప్రయివేట్ భూమిని డెవలప్మెంట్‌కు తీసుకుని లోకంలో ఎక్కడ లేని విధంగా భూ యజమానులకు షేర్.. వాటా ఇచ్చిన తీరును ప్రత్యేక కథనంగా ఇచ్చారు.

ఈటీవీ కథనం వెనుక విజయసాయి రెడ్డి ఉన్నారని ఇప్పుడు ఎంవివి మద్దతుదారులు అంటున్నారు. ఇలా ఇలా ఒకరి బాగోతాన్ని ఒకరు బయటపెట్టుకుని మొత్తం పార్టీ పరువు తీస్తున్నారని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఇద్దరు ఎంపీలు ఒకరిమీద ఒకరు ఇలా మీడియా ముఖంగా అక్రమాలు వెల్లడించడం మంచిదే.. ఎవరి అసలు రంగు ఏమిటో తెలుస్తుంది అని విశాఖ ప్రజలు అంటున్నారు.

Updated On 13 Oct 2022 3:23 PM GMT
krs

krs

Next Story