విధాత‌: పీజీ వైద్య విద్యార్థిని ప్రీతిని లక్ష్యంగా చేసుకుని సీనియ‌ర్ విద్యార్థి సైఫ్ వేధించాడ‌ని వ‌రంగ‌ల్ పోలీసు క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ శుక్ర‌వారం మీడియాకు వెల్ల‌డించారు. ఇత‌ర వైద్య విద్యార్థుల ముందు ప్రీతిని సైఫ్ అవ‌మానించాడ‌ని పేర్కొన్నారు. ప్రీతి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం కేసులో నిందితుడి సైఫ్‌ను అరెస్టు చేశామ‌ని తెలిపారు. ప్రీతి చాలా తెలివైన, ధైర్యం ఉన్న అమ్మాయి అని, అలాగే ఆమెది సున్నిత మ‌న‌స్తత్వం అని రంగ‌నాథ్ పేర్కొన్నారు. ఓ రోగికి సంబంధించిన కేస్ షీట్ విష‌యంలో ప్రీతిని […]

విధాత‌: పీజీ వైద్య విద్యార్థిని ప్రీతిని లక్ష్యంగా చేసుకుని సీనియ‌ర్ విద్యార్థి సైఫ్ వేధించాడ‌ని వ‌రంగ‌ల్ పోలీసు క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ శుక్ర‌వారం మీడియాకు వెల్ల‌డించారు. ఇత‌ర వైద్య విద్యార్థుల ముందు ప్రీతిని సైఫ్ అవ‌మానించాడ‌ని పేర్కొన్నారు. ప్రీతి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం కేసులో నిందితుడి సైఫ్‌ను అరెస్టు చేశామ‌ని తెలిపారు.

ప్రీతి చాలా తెలివైన, ధైర్యం ఉన్న అమ్మాయి అని, అలాగే ఆమెది సున్నిత మ‌న‌స్తత్వం అని రంగ‌నాథ్ పేర్కొన్నారు. ఓ రోగికి సంబంధించిన కేస్ షీట్ విష‌యంలో ప్రీతిని అవ‌మానించేలా సైఫ్ మాట్లాడాడ‌ని సీపీ తెలిపారు. అయితే ఈ నెల 18వ తేదీన వాట్సాప్ గ్రూపులో సైఫ్ మేసేజ్ పెట్టాడు.

ఈ మేసేజ్‌పై ప్రీతి స్పందిస్తూ.. త‌న‌ను ఉద్దేశించి గ్రూపులో వ్య‌క్తిగ‌తంగా చాట్ చేయ‌డం స‌రికాద‌ని, ఏదైనా ఉంటే హెచ్‌వోడీల దృష్టికి తీసుకెళ్లాల‌ని ఆమె చెప్పింది. సైఫ్ త‌న‌ను వేధిస్తున్న‌ట్లు ఇత‌ర ఫ్రెండ్స్‌తో చేసిన చాటింగ్‌లో ప్రీతి పేర్కొన్న‌ట్లు సీపీ తెలిపారు. బ్రెయిన్ లేదంటూ సైఫ్ హేళ‌న చేస్తూ మాట్లాడుతున్నాడ‌ని ప్రీతి ఆవేద‌న వ్య‌క్తం చేసిన‌ట్లు స్ప‌ష్టం చేశారు.

ఓ వ్య‌క్తి ఇన్‌స‌ల్ట్‌గా ఫీల‌యితే అది ర్యాగింగ్ కింద‌కే వ‌స్తుంద‌న్నారు. ఈ క్ర‌మంలో వాట్సాప్ గ్రూపు ద్వారా సేక‌రించిన ఆధారాల‌తో సైఫ్‌ను అరెస్టు చేసిన‌ట్లు సీపీ వెల్ల‌డించారు. గ‌తేడాది డిసెంబ‌ర్ 6వ తేదీన కూడా చిన్న చిన్న ఘ‌ట‌న‌లు జ‌రిగాయి.

సీనియ‌ర్ల‌ను జూనియ‌ర్లు సార్ అని పిల‌వాల‌నే క‌ల్చ‌ర్ అక్క‌డుంది. బాసిజం త‌ర‌హాలో ఉంద‌ని ప్రీతి భావించింద‌న్నారు. కేసును ప‌క్క‌దోవ ప‌ట్టిస్తున్నార‌నే ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌ని సీపీ స్ప‌ష్టం చేశారు. ఇలాంటి త‌ప్పుడు ప్ర‌చారం వ‌ల్ల విచార‌ణ‌పై ప్ర‌భావం ప‌డుతుంద‌ని సీపీ రంగ‌నాథ్ పేర్కొన్నారు.

Updated On 24 Feb 2023 2:41 PM GMT
Somu

Somu

Next Story