విధాత, సినిమా: సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతో కొత్త టాలెంట్ బయటికి వచ్చింది.. ఎందరో సెలబ్రిటీలుగా మారారు. అలాంటి వారిలో అషు రెడ్డి ఒకరు. సమంతాకు దగ్గర పోలికలు ఉండటంతో.. అందరూ ఆమెని జూనియర్ సమంత అని పిలవడం స్టార్ట్ చేశారు. అలాగే వర్మతో చేసిన కొన్ని వీడియోలు కూడా ఆమెకు మంచి క్రేజ్‌ని తెచ్చిపెట్టాయి.
View this post on Instagram
ఇక సోషల్ మీడియాలో ఆమె ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది. అయితే తాజాగా ఈ భామ ఆగ్రా వెళ్ళింది. ఆగ్రా వెళ్లిన అషు తాజ్ మహల్ ముందు ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో తన కాబోయే లవర్ ఎలా ఉండాలో తెలియజేసింది.
ముంతాజ్ ప్రేమకు గుర్తుగా షాజహాన్ తాజ్ మహల్ నిర్మించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈమె షాజహాన్‌ను ఓ కోరిక కోరింది. ఈ సందర్భంగా ఈ ఫోటోలను అషు రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ముంతాజ్ ప్రేమకు గుర్తుగా షాజహాన్ తాజ్ మహల్ కట్టించాడు. అలాగే షాజహాన్ లాగా ప్రేమించే వ్యక్తి నాకు వచ్చేలా ఆశీర్వదించండి అని షాజహాన్‌నే కోరిందీ ఈ హాట్ బ్యూటీ. దీనికి నెటిజన్ల కామెంట్స్ మాములుగా లేవనుకోండి. ఆమె పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
View this post on Instagram