విధాత: గుజరాత్ పోలీసులు తృణమూల్‌ కాంగ్రెస్‌పై కత్తి గట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు. తృణమూల్‌ జాతీయ అధికార ప్రతినిధి సాకేత్‌ గోఖలేను గురువారం మళ్లీ అరెస్టు చేశారు. క్రౌడ్‌ ఫండింగ్‌ పేరుతో నిధులు పోగుచేసి వాటిని దుర్వినయోగం చేశాడని అతనిపై అభియోగాలు మోపి అరెస్టు చేసి, తదుపరి విచారణ కోసం అహ్మదాబాద్‌ తరలిస్తున్నట్లు సైబర్ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ప్రకటించారు. గతంలోనూ మొదటి సారి సాకేత్‌ గోఖలేను డిసెంబర్‌ 6న అరెస్టు చేశారు. గుజరాత్ మోర్బీ పట్టణంలో బ్రిడ్జి కూలి […]

విధాత: గుజరాత్ పోలీసులు తృణమూల్‌ కాంగ్రెస్‌పై కత్తి గట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు. తృణమూల్‌ జాతీయ అధికార ప్రతినిధి సాకేత్‌ గోఖలేను గురువారం మళ్లీ అరెస్టు చేశారు. క్రౌడ్‌ ఫండింగ్‌ పేరుతో నిధులు పోగుచేసి వాటిని దుర్వినయోగం చేశాడని అతనిపై అభియోగాలు మోపి అరెస్టు చేసి, తదుపరి విచారణ కోసం అహ్మదాబాద్‌ తరలిస్తున్నట్లు సైబర్ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ప్రకటించారు.

గతంలోనూ మొదటి సారి సాకేత్‌ గోఖలేను డిసెంబర్‌ 6న అరెస్టు చేశారు. గుజరాత్ మోర్బీ పట్టణంలో బ్రిడ్జి కూలి 134 మంది చనిపోయిన సందర్భంగా.. బాధితులను పరామర్శిచటం కోసం మోదీ వెళ్లారు. ఆయన రాక కోసం గుజరాత్‌ ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వ శాఖలు రూ.30 కోట్లు ఖర్చు చేశాయని, ఆ వివరాలన్నీ సమాచార హక్కు చట్టం ఆధారంగా ప్రభుత్వం నుంచి సేకరించిన గణాంకాలని సాకేత్‌ గోఖలే ప్రకటించారు.

ఆ మేరకు ఆయన సామాజిక మాధ్యమాల్లో ఆ విషయాన్ని పోస్టు చేసి పరామర్శ పేరుతో మోదీ ఆర్బాటం అనే రీతిలో వ్యాఖ్యానించాడు. అది ఉద్దేశ పూర్వకమైన విష ప్రచారమని బీజేపీ ఆగ్రహించింది. గుజరాత్‌ పోలీసులు గోకలేపై సైబర్‌ నేరం క్రింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

కానీ ఆ తర్వాత విచారణలో ఆర్టీఐ నుంచి గోఖలే ఏ సమాచారం సేకరించలేదని తేలిందని, తృణమూల్‌ నేత గోఖలే ప్రధాని మోదీపై కావాలనే తప్పుడు ప్రచారం చేయటం, ఆర్టీఐ పేరును దుర్వినయోగం చేయటం లాంటి కేసులు పెట్టి అతన్ని రెండో సారి డిసెంబర్‌ 8న అరెస్టు చేశారు.

2021 మార్చిలో జరిగిన పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాలం నుంచీ తృణమూల్‌ కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకొని అనేక రూపాల్లో బీజేపీ దాడులు చేస్తున్నది. అనేక మంది తృణమూల్‌ నేతలు, ఎంపీలపై ఈడీ, ఐటీ దాడులు జరిగాయి.

మమతా బెనర్జీతో సహా తృణమూల్‌ నేతలను భయబ్రాంతులకు గురిచేసి తృణమూల్ కాంగ్రెస్‌ను ఆత్మరక్షణలో పడేసి బీజేపీ ఎన్నికల్లో లబ్ధిపొందాలని విశ్వప్రయత్నాలు చేసింది. కానీ మమతా బెనర్జీ స్వతహాగా ఓటమిపాలైనా.., పార్టీకి తిరుగులేని మెజారిటీతో విజయాన్ని అందించి బీజేపీ పాచికలు పారకుండా చేశారు.

నాటి నుంచీ… బీజేపీ కక్షపూరిత చర్యలు మానలేదు అనటానికి తాజా అరెస్టే ఓ ఉదాహరణ అని తృణమూల్‌ వర్గాలు ఆరోపిస్తున్నాయి. సాకేత్‌ గోఖలే లక్ష్యంగా బీజేపీ కేసులు, అరెస్టులతో లొంగదీసుకోవటానికి చేస్తున్న ప్రయత్నాలకు ఇది తాజా నిదర్శనమని మమతా బెనర్జీ విమర్శించారు. తాము కేసులు, అరెస్టులకు బెదరబోమని మమతా బీజేపీని హెచ్చరించారు.

Updated On 31 Dec 2022 5:07 AM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story